కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Parking: అద్దె ఇంటిలో నివసించే వారు.. కారు ‘పార్కింగ్‌’ ఎక్కడ చేయాలి?

ABN, First Publish Date - 2023-11-16T13:55:05+05:30

అద్దె ఇంటిలో నివసించే వారు కారు పార్కింగ్‌ ఎక్కడ చేయాలి? ఆ స్థలం కారణంగా చెలరేగిన వివాదం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? వంటి పలు అంశాలకు హ్యూమన్‌ టచ్‌ను జోడించి తెరకెక్కించిన చిత్రమే ‘పార్కింగ్‌’. రాంకుమార్‌ బాలకృష్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 1న రిలీజ్ కానుంది. హరీష్‌ కళ్యాణ్‌, ఇందుజ హీరోహీరోయిన్లు. ఎం.ఎస్.భాస్కర్‌ ముఖ్య పాత్రను పోషించగా.. రమ, ప్రార్థన తదితరులు నటించారు.

Parking Movie Still

అద్దె ఇంటిలో నివసించే వారు కారు పార్కింగ్‌ (Car Parking) ఎక్కడ చేయాలి? ఆ స్థలం కారణంగా చెలరేగిన వివాదం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? వంటి పలు అంశాలకు హ్యూమన్‌ టచ్‌ను జోడించి తెరకెక్కించిన చిత్రమే ‘పార్కింగ్‌’ (Parking). డిసెంబరు 1న విడుదలకానుంది. హరీష్‌ కళ్యాణ్‌ (Harish Kalyan), ఇందుజ (Indhuja) హీరోహీరోయిన్లు. ఎం.ఎస్.భాస్కర్‌ ముఖ్య పాత్రను పోషించగా.. రమ, ప్రార్థన తదితరులు నటించారు. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం. రాంకుమార్‌ బాలకృష్ణన్‌ (Ramkumar Balakrishnan) దర్శకుడు. ఫ్యాషన్‌ స్టూడియోస్‌ సుధన్‌ సుదర్శన్‌, సోల్జర్స్‌ ఫ్యాక్టరీ కేఎస్‌ సినీష్‌ సంయుక్తంగా నిర్మించారు. థ్రిల్లర్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎడిటర్‌ ఫిలోమిన్‌ రాజ్‌, కెమెరా జిజు సన్నీ. ఈ చిత్రం గురించి తాజాగా నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో హరీష్‌ కళ్యాణ్‌, హీరోయిన్‌ ఇందుజ, దర్శకుడు రాంకుమార్‌ బాలకృష్ణన్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు రాంకుమార్‌ బాలకృష్ణన్‌ మాట్లాడుతూ.. ‘‘నగరాల్లో అద్దె ఇళ్లల్లో నివాసం ఉండే వారు కారును కలిగివుంటే, పార్కింగ్‌ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ పార్కింగ్‌ వివాదం ఘర్షణలకు దారితీయడమే కాకుండా, హత్యలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పలు యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సంఘటనలకు హ్యూమన్‌ టచ్‌ను జోడించాం. ఒక సమస్య ఉత్పన్నమైతే ఒక్క క్షణం మానవత్వంతో ఆలోచిస్తే దానికి పరిష్కారం లభిస్తుంది. ఇదే ఈ చిత్రం ప్రధాన అంశం. ప్రత్యేకించిన సందేశం లేదు. ప్రస్తుతానికి తమిళంలోనే విడుదల చేస్తున్నాం. ప్రేక్షకుల స్పందనను బట్టి ఇతర భాషల్లోకి అనువాదం చేస్తారా? లేక రీమేక్‌ చేస్తారా? అన్నది నిర్మాతల ఇష్టం. (Director Ramkumar Balakrishnan about Parking)


హరీష్‌ కళ్యాణ్‌ ఇందులో సాఫ్ట్‌వేర్‌గా ఈశ్వర్‌ పాత్రలో నటించారు. ఇందుజ ఆయన భార్యగా, సినిమా మొత్తం గర్భిణి పాత్రలో కనిపిస్తారు. 36 రోజుల్లో ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేశాం. మెజార్టీ భాగం చెన్నై వలసరవాక్కం, విల్లివాక్కంలలో చిత్రీకరించగా, కొన్ని సన్నివేశాలను ఈసీఆర్‌లో షూట్‌ చేశాం. రెండు పాటలున్నాయి. ప్రోమోకు, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. సెప్టెంబరు 28న రిలీజ్‌ చేయాలని భావించాం. కానీ, ఆ రోజున నాలుగు చిత్రాలు విడుదల కావడంతో డిసెంబరుకు వాయిదా వేశాం’’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

========================

*Anushka Sharma: నువ్వు నిజంగా దేవుడి బిడ్డవు.. కోహ్లీపై అనుష్క శర్మ పోస్ట్ వైరల్

**************************

*Malvika Sharma: ‘హరోం హర’ నుండి ‘దేవి’ లుక్ విడుదల

*******************************

*Namitha Husband: పోలీసుల విచారణకు హాజరుకాని నటి నమిత భర్త.. లేఖలో ఏం చెప్పారంటే?

********************************

*Karthika Nair: రాధ కుమార్తె కార్తీక నాయర్ పెళ్లాడబోయే వ్యక్తి ఇతనే..

**********************************

Updated Date - 2023-11-16T13:55:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!