సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

ABN, First Publish Date - 2023-03-14T20:28:01+05:30

ప్రపంచం గర్వించే ఆస్కార్ అవార్డు అందుకోవడం అనేది సినిమా విభాగానికి చెందిన ప్రతి ఒక్కరి కల. అలాంటిది తొలి ప్రయత్నంలోనే ఆస్కార్ అవార్డు (Oscar Award) అందుకున్న దర్శకురాలిగా కార్తికి గోన్‌సాల్వెస్ (Kartiki Gonsalves) రికార్డు...

The Elephant Whisperers Movie Still
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచం గర్వించే ఆస్కార్ అవార్డు అందుకోవడం అనేది సినిమా విభాగానికి చెందిన ప్రతి ఒక్కరి కల. అలాంటిది తొలి ప్రయత్నంలోనే ఆస్కార్ అవార్డు (Oscar Award) అందుకున్న దర్శకురాలిగా కార్తికి గోన్‌సాల్వెస్ (Kartiki Gonsalves) రికార్డు క్రియేట్ చేశారు. ఆమె తెరకెక్కించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ (The Elephant Whisperers) డ్యాక్యు మెంటరీ షార్ట్ ఫిల్మ్.. భారతదేశం (India) తరపున అధికారికంగా ఆస్కార్‌కు ఎన్నికై.. అవార్డు కొల్లగొట్టింది. అయితే ఈ ఆస్కార్ అందుకున్న ఆనందం వారికి కాసేపటికే ఆవిరైంది. అందుకు కారణం ఈ షార్ట్ ఫిల్మ్‌లో ప్రధాన పాత్ర పోషించిన ఏనుగులే. ఆస్కార్ అందుకున్న ఆనందాన్ని ఆ ఏనుగులు (Elephants) ఆవిరి చేస్తూ యూనిట్‌కి షాకిచ్చాయి. విషయం ఏమిటంటే..

ఆస్కార్ అవార్డు గెలిచిన డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ (Best Documentary Short Film) ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’‌లో రఘు (Raghu), అమ్ము (Ammu) అనే రెండు ఏనుగులు నటించాయి. అయితే దురదృష్టవశాత్తు ఆ ఏనుగులు ఆదివారం తప్పిపోయినట్లుగా.. వాటి సంరక్షకుడు బొమ్మన్ (Bomman) తెలిపారు. కొంతమంది తాగుబోతులను తరుముకుంటూ.. రెండు ఏనుగులూ తమిళనాడు (Tamil Nadu)లోని కృష్ణగిరి (KrishnaGiri) అరణ్యంలోకి వెళ్లి.. అదృశ్యం అయినట్లుగా ఆయన చెప్పారు. ఇంకా వాటి జాడ తెలియరాలేదని తాజాగా బొమ్మన్ వెల్లడించారు. దీంతో ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మాణంలో భాగమైన వారంతా నిరాశకు లోనయ్యారు. ఆస్కార్ అవార్డుతో వాటి దగ్గర ఫొటో దిగాలనుకున్న టీమ్ ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం రఘు, అమ్ము కోసం గాలిస్తున్నట్లుగా సమాచారం.

‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ (The Elephant Whisperers) డాక్యుమెంటరీ విషయానికి వస్తే.. ఇది రెండు అనాథ ఏనుగు పిల్లల కథ. అమ్ము, రఘు అనే రెండు అనాథ ఏనుగు పిల్లలను ఆదరించిన దంపతుల స్టోరీ ఇది. మొత్తంగా 42 నిమిషాల నిడివి గల ఈ చిత్రంలో కనిపించేది కేవలం ఇద్దరు వ్యక్తులు, రెండు ఏనుగులు మాత్రమే. ఈ చిత్రాన్ని రూపొందించిన కార్తికీకి (Kartiki) ఇది తొలి చిత్రం. తొలి చిత్రంతోనే ఆస్కార్ అందుకున్న కార్తికీపై ప్రశంసల వర్షం కురుస్తోన్న నేపథ్యంలో.. అమ్ము, రఘు మిస్సింగ్ అనే వార్త వినాల్సి రావడం నిజంగా బాధాకరమే. (The Elephant Whisperers Cast Ammu and Raghu Missing)

ఇవి కూడా చదవండి:

*********************************

*Dasara Trailer: ఇదీ ట్రైలర్‌ అంటే.. ఒక్కొక్కనికి రాల్తాయ్!!

*Thammareddy Bharadwaja: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ అవార్డ్.. తమ్మారెడ్డి ఏమన్నారంటే?

*Oscar to RRR: తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి స్పందనిదే..

*Ram Charan: ఉపాసనని, ఆమె మెడలోని నగని కాపాడుకోవాలి

*Talasani: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్.. BJP ప్రభుత్వానికి ఇది గుణపాఠం

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

* Harish Shankar: పెరుగన్నం, బిర్యానీ.. దర్శకుడు మహాకు కౌంటర్

*Pavitra Naresh: బ్యాచ్‌లర్స్ ఫీల్ కాకండి.. ఈ మీమ్స్ ఏంటి సామి?

*Ram Charan: మా నాన్న పెంపకం అలాంటిది.. ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్

Updated Date - 2023-03-14T22:56:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!