Thankar Bachan: మనసును హత్తుకునే సినిమా చేశా.. ఇక ప్రేక్షకులే చెప్పాలి
ABN, First Publish Date - 2023-05-09T19:17:36+05:30
ఈ చిత్రం చూసిన తర్వాత తండ్రికి దూరంగా ఉండే పిల్లలు తండ్రిని వెతుక్కుంటూ వెళతారు. ఈ కాలంలో ప్రతి ఒక్కరి వద్ద అన్నీ ఉన్నాయి. కానీ, ప్రేమానుబంధాలు లేవు. వీటిని తెలియజెప్పే చిత్రమే
ఒక చిత్ర జయాపజయాన్ని ఖరారు చేసేది ప్రేక్షకులేనని, వారే అసలైన అంతిమ న్యాయ నిర్ణేతలని ప్రముఖ దర్శకుడు తంగర్ బచ్చాన్ (Thankar Bachan) అన్నారు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కరుమేఘంగల్ కలైగిండ్రన’ (కేకే) (Karumegangal Kalaigindrana). భారతీరాజా, గౌతం వాసుదేవ్ మీనన్, యోగిబాబు, అదితి బాలన్, ఎస్.ఏ.చంద్రశేఖర్‌లు ప్రధాన పాత్రలను పోషించారు. గేయ రచన వైరముత్తు చేయగా, జీవీ ప్రకాష్ స్వరాలు సమకూర్చారు. ఈ మూవీ ఆడియో విడుదల కార్యక్రమం తాజాగా చెన్నై నగరంలో జరిగింది. ఈ వేడుకకు చిత్రం బృందంతో పాటు దర్శకులు పేరరసు, లోకేష్ కనగరాజ్, నిర్మాతలు పిరమిడ్ నటరాజ్, ఫైవ్‌స్టార్ కదిరేశన్, సీనియర్ నటుడు ఢిల్లీ గణేష్, నిర్మాత వీరశక్తి తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు తంగర్ బచ్చాన్ (Thankar Bachan) మాట్లాడుతూ.. ‘కరుమేఘంగల్ ఏన్ కలైగిండ్రన’ అనే షార్ట్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం చూసిన తర్వాత తండ్రికి దూరంగా ఉండే పిల్లలు తండ్రిని వెతుక్కుంటూ వెళతారు. ఈ కాలంలో ప్రతి ఒక్కరి వద్ద అన్నీ ఉన్నాయి. కానీ, ప్రేమానుబంధాలు లేవు. వీటిని తెలియజెప్పే చిత్రమే ఇది. ఒక చిత్రం విజయంలో ప్రేక్షకులే అంతిమ న్యాయ నిర్ణేతలు. ప్రతి ఒక్కరి మనసును హత్తుకునేలా ఈ మూవీ ఉంటుందని అన్నారు. సీనియర్ దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నా కుమారుడు విజయ్‌ను హీరోగా పరిచయం చేసే చిత్రానికి భారతీరాజా, గౌతం వాసుదేవ్ మీనన్ వంటి వారు డైరెక్ట్ చేయాలని కోరాను. కానీ వారు ముక్కుసూటిగా చెప్పకుండా పరోక్షంగా నిరాసక్తతను వ్యక్తం చేశారు. చివరకు నా దర్శకత్వంలోనే హీరోగా పరిచయం చేశాను. అదికూడా ఒకందుకు మంచే జరిగింది. విజయ్ కమర్షియల్ హీరోగా సక్సెస్ కావడానికి దోహదపడింది. ఇది దైవ నిర్ణయంగా భావిస్తానని అన్నారు. (KK Audio Launch)
నిర్మాత దురై వీరశక్తి మాట్లాడుతూ.. ‘ఇది నా తొలి చిత్రం. తంగర్ బచ్చాన్ వంటి దర్శకుడితో సినిమా తీయడం భాగ్యంగా భావిస్తున్నాను’ అన్నారు. నటి అదితి బాలన్ (Aditi Balan) మాట్లాడుతూ, ‘ఎంతోమంది లెజెండ్రీ దర్శకులు నటించిన ఈ చిత్రంలో నేను కూడా భాగస్వామిగా ఉండటం జీవితంలో మరిచిపోలేని తీపి జ్ఞాపకం’ అన్నారు. సంగీత దర్శకుడు జీవీ (GV Prakash Kumar) మాట్లాడుతూ, ‘తంగర్ బచ్చాన్ చిత్రానికి సంగీతం సమకూర్చాలన్న ఆశ ఎప్పటినుంచో ఉంది. అది ఈ మూవీతో తీరిపోయింది’ అని అన్నారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Vasuki Anand: పవన్ కల్యాణ్ సోదరి అందుకే రీ ఎంట్రీ ఇస్తున్నానంటోంది
*VD12: విజయ్ బర్త్‌డే స్పెషల్‌గా ప్రత్యేక పోస్టర్.. ఫ్యాన్స్ ఖుష్
*Kushi: సినిమా పేర్లతో విజయ్ దేవరకొండ, సమంత పాటేసుకున్నారు.. పాట ఎలా ఉందంటే..
*PKSDT: టైటిల్ ఫిక్సయిందా.. ‘దేవుడే దిగివచ్చినా’ కాదా?
*Tamanna: పొంగల్‌కి శృతిహాసన్.. ఇండిపెండెన్స్ డేకి తమన్నా..
*The Kerala Story: మరో స్టేట్‌లో నిషేధం.. షాక్‌లో చిత్రయూనిట్