Rajinikanth 170: ‘తలైవర్ 170’ మొదలైంది, ముగ్గురు హీరోయిన్లకు అవకాశం
ABN, First Publish Date - 2023-10-04T17:53:13+05:30
రజినీకాంత్ నటించిన తాజా చిత్రం 'జైలర్' బాక్స్ ఆఫీస్ ముందు ఇరగదీసి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇంకో సినిమా 'లాల్ సలాం' విడుదలకి సిద్ధంగా వుంది. ఇప్పుడు తలైవర్ 170వ సినిమా కూడా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఇది ఒక మల్టీ స్టారర్ సినిమా, ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి కూడా వున్నారు. జ్ఞానవేల్ దర్శకుడు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ‘జైలర్’ #Jailer వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘తలైవర్ 170’ #Thalaivar170 అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా ఈరోజు పూజాకార్యక్రమంతో మొదలైంది. త్రివేండ్రంలో కథానాయకుడు రజనీకాంత్, దర్శకుడు మిగతా సాంకేంతిక నిపుణులు ఈ పూజకు హాజరయ్యారు. ఇది ఒక పెద్ద మల్టీ స్టారర్ సినిమా గా తయారవుతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్ (AmitabhBachchan) ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు, అలాగే మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్ (FahadhFaasil ) కూడా వున్నారు.
తెలుగు నుండి భల్లాలదేవుడు రానా దగ్గుబాటి (RanaDaggubati) ఈ సినిమాలో ఇంకో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు అని చిత్ర యూనిట్ అధికారికంగానే చెప్పింది. ఇక అనిరుద్ రవిచందర్ (AnirudhRavichander) దీనికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఇవన్నీ ఇలా ఉంటే, ఇందులో ముగ్గురు హీరోయిన్లకు నటించే అవకాశం కల్పించారు. వీరిలో ఒకరు మాలీవుడ్‌కు చెందిన మంజు వారియర్ (ManjuWarrier), కోలీవుడ్‌కు చెందిన దుషార విజయన్ ( DusharaVijayan), బాలీవుడ్‌కు చెందిన రితికా సింగ్ (RitikaSingh) ఉన్నారు.
సాధారణంగా చిత్ర పరిశ్రమలో రాణించే హీరోయిన్లు తలైవర్ చిత్రంలో చిన్నపాటి వేషంలో అయినా నటించాలని కలలు కంటుంటారు. అలాంటిది ఏకంగా హీరోయిన్లుగా నటించే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తారు. ఇపుడు, రితికా, దుషార, మంజు వారియర్ పరిస్థితి అలానే ఉంది. ఈ ముగ్గురుకి అతి తక్కువ కాలంలోనే సూపర్‌స్టార్ రజనీ సినిమాలో నటించే అవకాశం వస్తుందని ఏ ఒక్కరూ భావించలేదు. దీంతో వారు తెగ సంబరపడిపోతూ, తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ‘జైభీమ్’ #JaiBheem ఫేం జ్ఞానవేల్ (TJGnanavel) దర్శకత్వం వహించే ఈ చిత్రానికి లైకా ప్రొడక్షన్స్ #LycaProductions బ్యానరుపై నిర్మాత సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో రజినీకాంత్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఎందుకంటే అతని లుక్స్ ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే చాలా బాగుంది. ఈ లుక్ కోసం భారతదేశం లో బాగా పేరున్న హెయిర్ స్టయిలిస్ట్ ఆలిం హకీమ్ (AalimHakim) చేత చేయించారు అని తెలిసింది. ఆలిం తన సాంఘీక మాధ్యమంలో రజినీకాంత్ తో వున్న ఒక ఫోటో షేర్ చేశారు. ఇది తలైవర్ 170 వ సినిమా కోసం అతని లుక్ మార్చారని తెలుస్తోంది. అందుకే ఈ సినిమా పూజా కార్యక్రమానికి ముందు ఈ ఫోటో షేర్ చెయ్యడంతో అది వైరల్ అయింది.