Leo: క్రేజీ అప్‌డేట్‌తో ప్రేక్షకులకి ట్రీట్ ఇస్తామంటున్న ‘లియో’ టీమ్?.. ఎప్పుడంటే..
ABN, First Publish Date - 2023-04-05T17:30:34+05:30
‘బాహుబలి’ చిత్రాలతో సౌత్ సినిమాల రేంజే మారిపోయింది. ఆ సినిమా పాన్ ఇండియాలో స్థాయిలో విడుదలై ఆకట్టుకోవడంతో ‘పుష్ప’, ‘కేజీఎఫ్’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి పలు చిత్రాలు అదే బాట పట్టి సక్సెస్ కొట్టాయి.
‘బాహుబలి’ చిత్రాలతో సౌత్ సినిమాల రేంజే మారిపోయింది. ఆ సినిమా పాన్ ఇండియాలో స్థాయిలో విడుదలై ఆకట్టుకోవడంతో ‘పుష్ప’, ‘కేజీఎఫ్’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి పలు చిత్రాలు అదే బాట పట్టి సక్సెస్ కొట్టాయి. దీంతో.. ఇక్కడ నిర్మాణమయ్యే ప్రతి సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ కోవాలోనే ‘విక్రమ్’ (Vikram)అనే చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంతో తమిళ యువ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj)కి మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ మూవీతో ‘లోకేశ్ కనగరాజ్ యూనివర్స్’నే క్రియేట్ చేశాడు. ఈ యూనివర్స్‌లో ఇప్పటికే ‘ఖైదీ’తో కార్తీ (Karthi), ‘విక్రమ్’తో కమల్ హాసన్ (Kamal Haasan), సూర్య (Suriya) భాగమయ్యారు.
తాజాగా ఈ యూనివర్స్‌ని కొనసాగిస్తూ లోకేశ్ ప్రస్తుతం దళపతి విజయ్ (Thalapathy Vijay)తో ‘లియో’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై ప్రకటించినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలోనే గత కొంతకాలం క్రితం ఓ టీజర్‌ని విడుదల చేసింది ఈ మూవీ టీం. ఆ టీజర్‌కి యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ తరుణంలోనే ఈ మూవీ త్రిష (Trisha), బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారంటూ వార్తలు రావడంతో ఈ చిత్రం కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకుంటుందని సినీ లవర్స్ అనుకుంటున్నారు. అంతేకాకుండా.. నెక్ట్ అప్‌డేట్ గురించి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
‘లియో’కి సంబంధించి దాదాపు 40 రోజుల పాటు కశ్మీర్‌లో షూటింగ్ జరిగింది. అలాగే.. త్వరలో చెన్నైలో 17 రోజుల పాటు షూటింగ్ చేయనున్నట్లు సమాచారం. ఈ తరుణంలోనే ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇవ్వడానికి మూవీ టీం సిద్ధమవుతోందట. అది కూడా విజయ్ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 22న ఇచ్చే ఆ అప్‌డేట్‌తో విజయ్ ఫ్యాన్స్‌తో పాటు లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ అభిమానులను కూడా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా.. పాన్ ఇండియా స్థాయిలో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న తమిళ సినీ పరిశ్రమకి ఈ చిత్రం ఓ దారి చూపుంతుందని అందరూ అనుకుంటున్నారు. కాగా.. ఈ సినిమాని అక్టోబర్ 19న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
Adipurush: మరోసారి చిక్కుల్లో ప్రభాస్ మూవీ.. మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ..
Bholaa: సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టి.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న బాలీవుడ్ స్టార్!?
Shilpa Shetty: పబ్లిక్‌లో హాలీవుడ్ నటుడితో ముద్దు.. 15 ఏళ్ల క్రితం కేసులో నటికి రిలీఫ్
RRR in Japan: ‘ఆర్ఆర్ఆర్’పై రాజమౌళి పోస్ట్.. అందులోనూ జక్కన్న మార్క్ చూపించాడుగా..
Janhvi Kapoor: తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జూనియర్ శ్రీదేవి.. తర్వాత అడుగు అటువైపేనా?
Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..
Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..