సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Superstar Rajinikanth: ‘క్రీడల్లో రారాజు ఆ ఆటే.. క్రికెట్ కాదు..’

ABN, First Publish Date - 2023-03-21T14:22:15+05:30

దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న అతి కొద్దిమంది నటుల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) ఒకరు.

Rajinikanth
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న అతి కొద్దిమంది నటుల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) ఒకరు. కోలీవుడ్ నటుడైనప్పటికీ ఆయన ప్రతి సినిమా వివిధ భాషల్లోకి డబ్ అవుతూ.. ప్రేక్షకులని అలరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా.. ఆయనకి జపాన్ వంటి విదేశాల్లో సైతం చాలామంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయన అభిమానుల్లో ఒకరు చెన్నై శివారు ప్రాంతమైన మహాబలిపురంలో వరల్డ్‌ క్లాస్‌ యూత్‌ ఫుట్‌బాల్‌ అకాడమీని స్థాపించారు. దీనిపై రజనీకాంత్‌ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

అందులో.. ‘తమిళనాడులో వరల్డ్‌ క్లాస్‌ యూత్‌ ఫుట్‌బాల్‌ అకాడమీని స్థాపించడం చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తోంది. క్రీడల్లో ఫుట్‌బాల్‌ (Football) రారాజు అని చెబుతుంటారు. మన దేశంలో కూడా ఇదే ఎంతో ప్రాముఖ్యమైన క్రీడగా ఉండేది. అనతికాలంలో క్రికెట్‌ (Cricket) ప్రాచుర్యమైన తర్వాత ఫుట్‌బాల్‌ క్రీడకు ఆదరణ తగ్గిపోయింది. ప్రస్తుతం కేరళ, బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో ఈ గేమ్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. గత ప్రపంచ కప్‌ సందర్భంగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు చూడనివారు లేరు. ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీ ప్రతి ఒక్కరికి హీరోగా మారిపోయాడు. చిన్న దేశాలు సైతం ప్రపంచస్థాయి ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాయి.

కానీ, మనదేశం ఫుట్‌బాల్‌కి ఆదరణ లభించకపోవడం విచారకరం. ఇలాంటి పరిస్థితుల్లో యూత్‌ ఫుట్‌బాల్‌ అకాడమీని స్థాపించడం స్వాగతించదగ్గ పరిణామం. ఈ అకాడమీ ద్వారా యెస్సీ, రోనాల్డో వంటి క్రీడాకారులను అందిస్తుందని ఆశిస్తున్నా. అందులో ఉండే ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు’ అని రజనీకాంత్‌ విడుదల చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Updated Date - 2023-03-21T14:22:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!