సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Karthi: మార్కులు సాధించడమే విద్యాభ్యాసం కాదు

ABN, First Publish Date - 2023-07-17T15:35:53+05:30

విద్యాభ్యాసం అంటే కేవలం అధిక మార్కులు సాధించడమే కాదని.. నిత్య జీవితానికి, సైన్స్‌కు మధ్య ఉన్న బంధాన్ని అర్థమయ్యేలా వివరించడమే విద్య అని హీరో కార్తీ అన్నారు. కార్తీ తండ్రి, సీనియర్‌ హీరో శివకుమార్‌ స్థాపించిన శ్రీ శివకుమార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ 44వ అవార్డులు, ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం ఆదివారం చెన్నైలో జరిగింది. ఆ కార్యక్రమంలో కార్తీ విద్యాభ్యాసం గురించి మాట్లాడారు.

Hero Karthi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యాభ్యాసం అంటే కేవలం అధిక మార్కులు సాధించడమే కాదని.. నిత్య జీవితానికి, సైన్స్‌కు మధ్య ఉన్న బంధాన్ని అర్థమయ్యేలా వివరించడమే విద్య అని హీరో కార్తీ (Karthi) అన్నారు. కార్తీ తండ్రి, సీనియర్‌ హీరో శివకుమార్‌ (Siva Kumar) తన 100వ చిత్రం సందర్భంగా శ్రీ శివకుమార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ (Sri Sivakumar Charitable Trust)ను నెలకొల్పగా దీన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ ప్రారంభించారు. 43 యేళ్ళుగా ఈ సంస్థ ప్లస్‌టూలో మంచి మార్కులు పొందిన విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం 44వ అవార్డులు, ఆర్థిక సాయం పంపిణీ (44th Year Award Ceremony) చెన్నైలో జరిగింది.


ఈ కార్యక్రమంలో ఫౌండర్‌ శివకుమార్‌, ఆయన ఇద్దరు కుమారులైన హీరోలు సూర్య (Suriya), కార్తీలు పాల్గొని, ప్లస్‌టూలో అధిక మార్కులు పొంది, తల్లిదండ్రులు లేని 25 మంది విద్యార్థులను ఎంపిక చేసి, ఆర్థిక సాయం, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఒక్కో విద్యార్థికి రూ.10 వేలు అందించారు. ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ... దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించి, కుల, మతభేదాల్లేకుండా చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఒక వ్యక్తి చదువుకుంటే, ఆ కుటుంబంలో ఒక తరం వృద్ధిలోకి వస్తుందన్నారు.

హీరో సూర్య (Suriya) మాట్లాడుతూ... దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాన విద్యావకాశాలు లభించాలని ఆకాంక్షించారు. ఇందుకోసం విద్యా సంస్థలు, విద్యారంగానికి చెందిన ఏజెన్సీలతో కలిసి తన సారథ్యంలోని అగరం ఫౌండేషన్‌ (Agaram Foundation) పని చేస్తుందన్నారు. అగరం ఫౌండేషన్‌ ద్వారా గత 14 యేళ్ళలో 5200 మంది తీర, కొండ ప్రాంత గ్రామాలు, శరణార్థుల శిబిరాల్లో నివసించే పేద విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించామన్నారు. సీనియర్‌ హీరో శివకుమార్‌ (Siva Kumar) మాట్లాడుతూ... ఈ చారిటబుల్‌ ట్రస్ట్‌ను 1979, మే నెలలో ప్రారంభించగా, 30 యేళ్ళపాటు తన పర్యవేక్షణలో ఉన్న ఈ ట్రస్ట్‌ నిర్వహణ బాధ్యతలను ఇపుడు అగరం ఫౌండేషన్‌ స్వీకరించి సమర్థవంతంగా నిర్వహిస్తోందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Nidhhi Agerwal: పవర్‌స్టార్‌కి థ్యాంక్స్ చెప్పిన నిధి.. పోస్ట్ వైరల్

**************************************

*SSMB29: మహేష్ కుమార్తె, ఎన్టీఆర్ కుమారుడు.. ఇరు హీరోల ఫ్యాన్స్‌కి ట్రీటే ట్రీటు!

**************************************

*Namrata Shirodkar: గౌతమ్ ఎంట్రీకి టైముంది.. సితార ఇంట్రెస్ట్‌గా ఉంది

**************************************

*Anasuya: మళ్లీ ఏమైంది అనసూయ.. ‘బేబీ’ మూవీ గురించేనా..!

**************************************

*Keerthi Suresh: మీ షర్టు వేసుకుంటానని హీరోని అడిగేశా..

**************************************

*Sai Dharam Tej: పవన్ మామయ్య.. నన్ను కూడా రాజకీయాల్లోకి రమ్మన్నారు

**************************************

Updated Date - 2023-07-17T15:48:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!