‘డ్రగ్స్’కు వ్యతిరేకంగా ప్రచార గీతం.. ఆవిష్కరించిన డీజీపీ
ABN, First Publish Date - 2023-12-15T17:41:54+05:30
మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, నష్టాల గురించి అవగాహన కల్పించేలా ‘లైఫ్ ఇరుక్కు ... డ్రగ్స్ ఎదర్కు’ అనే పేరుతో రూపొందిన ప్రచార గీతాన్ని తమిళనాడు రాష్ట్ర డీజీపీ శంకర్ జీవాల్ చెన్నై నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో తాజాగా ఆవిష్కరించారు. గేయరచన చేసిన వైసాగ్... నేపథ్యగానం కూడా చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు జిబ్రాన్ (Gibran) సంగీతం అందించారు.
మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, నష్టాల గురించి అవగాహన కల్పించేలా ‘లైఫ్ ఇరుక్కు ... డ్రగ్స్ ఎదర్కు’ అనే పేరుతో రూపొందిన ప్రచార గీతాన్ని తమిళనాడు రాష్ట్ర డీజీపీ శంకర్ జీవాల్ (DGP Shankar Jiwal) చెన్నై నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో తాజాగా ఆవిష్కరించారు. గేయరచన చేసిన వైసాగ్... నేపథ్యగానం కూడా చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు జిబ్రాన్ (Gibran) సంగీతం అందించారు. ఈ ప్రచార గీతం తయారీలో తమిళనాడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (టీఎన్ సీఐడీ) కీలక భూమికను పోషించింది. (Awareness Song Against Drugs)
డ్రగ్ రహిత జీవనశైలిని ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలను పాట రూపంలో ఆవిష్కరించారు. అలాగే, రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలను అడ్డుకోవడంలో తమిళనాడు సీఐడీ పోలీస్ విభాగం విశేష కృషి చేస్తుంది. ఈ సేవలను ఈ ఆల్బమ్‌లో ప్రస్తావించారు. ఇది కేవలం ఒక ప్రచార గీతం మాత్రమే కాదని, మత్తు బారిన పడుతున్న యువతకు ఇచ్చే ఉద్వేగభరితమైన పిలుపుగా ఆల్బమ్ తయారీదారులు పేర్కొంటున్నారు. ఏఐ పవర్ యానిమేషన్‌తో ఈ ఆల్బమ్‌ను రూపొందించారు. (drug-free state)
ఇవి కూడా చదవండి:
====================
*Adhik Weds Aishwarya: అంగరంగ వైభవంగా అధిక్, ఐశ్వర్యల వివాహం.. ఫొటోలు వైరల్
*************************************
*Naga Vamsi: ‘ఓ మై బేబీ’ పాట ట్రోలింగ్‌పై మంకీలతో పోల్చుతూ.. మళ్లీ వివరణ
*********************************
*Guntur Kaaram: అడ్డడ్డే.. ‘ఓ మై బేబీ’ ఎంత పని చేసింది.. ట్విట్టర్ నుండి రామ్‌జో అవుట్!
***********************************