Siva Karthikeyan: ఆ హీరోతో నటించాలని ఉంది
ABN, First Publish Date - 2023-07-22T16:41:14+05:30
తాను ఒక మంచి నటుడిగా కంటే మంచి ఎంటర్‌టైనర్‌గా ఉండాలని అనేక మంది కోరుకుంటున్నారని హీరో శివకార్తికేయన్ అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘మావీరన్’. ఈ సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లోనే రూ.50 కోట్లు రాబట్టుకోవడంతో.. చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతితో స్ర్కీన్ షేర్ చేసుకోవాలనుందని శివకార్తికేయన్ తెలిపారు.
తాను ఒక మంచి నటుడిగా కంటే మంచి ఎంటర్‌టైనర్‌గా ఉండాలని అనేక మంది కోరుకుంటున్నారని హీరో శివకార్తికేయన్ (Siva Karthikeyan) అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘మావీరన్’ (Maaveeran). కోలీవుడ్‌లో ఈ సినిమా విడుదలైన తొలి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుని, తొలి మూడు రోజుల్లోనే రూ.50 కోట్లు రాబట్టింది. ఈ మూవీ సక్సెస్ మీట్‌ను తాజాగా చెన్నై నగరంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ... ‘ప్రిన్స్’ (Prince) చిత్రం నిరాశపరిచిన నేపథ్యంలో ‘మావీరన్’ విజయం సాధించడం సంతోషంగా ఉంది. ‘రెమో’ (Remo) చిత్రంలో నటించే సమయంలో కేవలం గెటప్ మార్చితే సరిపోదని, యాక్టింగ్ చేయాలని సూచించారు. ఇప్పుడు మంచి నటుడిగా కంటే ఒక మంచి ఎంటర్‌టైనర్‌గా ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ‘మావీరన్’లో నేను హాస్యం పండించలేదు. అయినప్పటికీ అనేకమంది నన్ను అభినందిస్తున్నారు. సీనియర్ నటి సరిత (Saritha) ఇందులో నాకు అమ్మగా నటించడం ఈ మూవీకి ఎంతో బలం.
ఇందులో ఒక కీలకమైన పాత్ర కోసం విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా సంతోషం. చిత్ర బృందం కోరగానే ఆయన సమ్మతం తెలిపారు. ఆ విధంగా విజయ్ సేతుపతితో పనిచేశా. కానీ, ఆయనతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవాలని ఉంది. హీరోయిన్ అదితి శంకర్ (Aditi Shankar)కు సినిమాలో తక్కువ సన్నివేశాలే ఉన్నప్పటికీ ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమెకు థ్యాంక్స్. ఈ సినిమాను చూసిన ఉదయనిధి, సూరి, దర్శకులు శంకర్, పాండిరాజ్ వంటివారు ఎంతగానో అభినందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అశ్విన్, అదితి శంకర్ కూడా మాట్లాడారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Bhagavanth Kesari: ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది
**************************************
*Amala Paul: మళ్లీ స్పాట్‌లైట్‌లోకి అమల.. ఫొటోస్‌తో మతి పోగొట్టేసిందిగా!
**************************************
*SS Rajamouli: ‘కల్కి 2989 AD’ గ్లింప్స్ రాజమౌళికి నచ్చిందా.. ఎలా స్పందించారంటే?
**************************************
*Unstoppable: ఓటీటీలోకి వచ్చేసిన ‘అన్‌స్టాపబుల్’.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..
**************************************
*Malavika Mohanan: జీవితం ఒక కళాకృతి కాదా?
**************************************