Shruti Haasan: అందుకే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలలో చేశా..
ABN, First Publish Date - 2023-04-08T09:24:43+05:30
చిరంజీవి (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya), బాలకృష్ణ (Balakrishna) ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రాల్లో నటించడంపై వచ్చిన విమర్శలకు శృతిహాసన్ సమాధానమిచ్చింది.. ఆమె మాట్లాడుతూ..
నేను నటిని.. హీరోల వయసును పట్టించుకోను. అందుకే టాలీవుడ్‌లో చిరంజీవిగారి (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya), బాలకృష్ణ (Balakrishna)గారి ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రాల్లో నటించానని అన్నారు గ్లామరస్ బ్యూటీ శృతిహాసన్ (Shruti Haasan). సుధీర్ఘకాలం తర్వాత తాజాగా ఆమె చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. ఈ మధ్య సీనియర్ హీరోల చిత్రాలలో నటించడంపై కొందరు విమర్శలు చేశారు. కానీ, ఆ రెండు సినిమా కథలు నచ్చడం వల్లే వాటిలో నటించాను. అంతేకానీ, ఇక్కడ హీరోల వయసును నేను పట్టించుకోలేదు. ఈ రెండూ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ‘ది ఐ’ అనే హాలీవుడ్ మూవీతో పాటు ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘సలార్’ (Salaar) చిత్రంలోనూ నటిస్తున్నాను. దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) టేకింగ్ అదో ప్రపంచంలా ఉంటుంది. ఇందులో నా పాత్రతో పాటు ఇతర విషయాలను వెల్లడించలేను. సినిమా హీరోలకు మాత్రమే కాదు కుర్రకారుకు కూడా డ్రీమ్ గర్ల్ అంటే హేమమాలిని (Hemamalini), శ్రీదేవి (Sridevi) వంటివారే.. నేను కాదు.
జీవితంలో పెళ్ళి (Marriage) అనేది ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదు. నా సినీ కెరీర్ తొలుత హిందీలో ప్రారంభమైంది.. ఆ తర్వాతే తెలుగు, తమిళ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చాను. నాకు స్టార్‌డమ్ రావడానికి టాలీవుడ్ చిత్రపరిశ్రమే కారణం. అందుకే ఆ చిత్ర పరిశ్రమకు విశ్వాసంగా ఉంటాను. తెలుగులో నేను నటించిన తొలి చిత్రం ఫ్లాప్ అయింది. అది నా కెరీర్‌ను సందిగ్ధంలో పడేసింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారి ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) చిత్రం నా ఫేట్‌ను మార్చేసింది. ఆ తర్వాత నటించిన అనేక చిత్రాలు వరుస విజయాలు సాధించాయి. నేను ముంబైలో ఉంటున్నా. అలాగని అక్కడ స్థిరపడబోను.
మా నాన్న కమల్ హాసల్ (Kamal Haasan) సొంత బ్యానరు రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (Raaj Kamal Films International) బ్యానరుపై నిర్మించే చిత్రాల్లో హీరోయిన్‌గా అవకాశం వస్తే నటిస్తా. సినిమాల్లో ప్రత్యేకించి జీవిత లక్ష్యమంటూ ఏదీ లేదు. నా సొంత కాళ్ళపై, నేను ధైర్యంగా నిలబడటమే నాకు ముఖ్యం. ఇకపోతే, మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కౌన్సెలింగ్ అవసరం. బాధితులు కూడా తమ బాధలను బహిరంగంగా వ్యక్తపరచాలి. ఇలాంటి వారిని కాపాడేందుకు ఒక సంస్థను ప్రారంభిస్తాను.. అని చెప్పారు. (Shruti Haasan Interview)
ఇవి కూడా చదవండి:
*********************************
*Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ మోసం చేశాడా?.. అసలా పోస్టర్‌లో ఉందెవరు?
*Rangamarthanda: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. ఏ ఓటీటీలో అంటే?
*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?
*NBK SRH: పాపం మన SRH క్రికెటర్లు.. బాలయ్య డైలాగ్స్ చెప్పలేక ఎన్ని తిప్పలు పడ్డారో..!