Seeran: సనాతన ధర్మంలోని లోపాలతో ‘సీరన్’.. కాంట్రవర్సీ మొదలైనట్టే..
ABN, First Publish Date - 2023-09-21T16:47:52+05:30
సనాతన ధర్మంలోని లోపాలను ఎత్తి చూపేదిగా ‘సీరన్’ చిత్రం ఉంటుందని ఆ చిత్ర హీరో, నిర్మాత జేమ్స్ కార్తీక్ వెల్లడించారు. నెట్కో స్టూడియోస్ బ్యానరుపై కార్తీక్, నియాజ్ వెంచర్స్ సమర్పణలో జేమ్స్ కార్తీక్ నిర్మించిన చిత్రం ‘సీరన్’. దురై కె.మురుగన్ దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ను చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.
సనాతన ధర్మంలోని లోపాలను ఎత్తి చూపేదిగా ‘సీరన్’ (Seeran) చిత్రం ఉంటుందని ఆ చిత్ర హీరో, నిర్మాత జేమ్స్ కార్తీక్ (James Karthik) వెల్లడించారు. నెట్కో స్టూడియోస్ బ్యానరుపై కార్తీక్, నియాజ్ వెంచర్స్ సమర్పణలో జేమ్స్ కార్తీక్ నిర్మించిన చిత్రం ‘సీరన్’. దురై కె.మురుగన్ (Durai K Murugan) దర్శకుడు. ఇందులో జేమ్స్ కార్తీక్‌తో పాటు ఇనియా, సోనియా అగర్వాల్, అజీద్, క్రిష్ కురూప్, నరేన్, అరుంధతి నాయర్, సెండ్రాయన్ తదితరులు నటించగా.. అరవింద్ జెరాల్డ్, శశిధరన్ సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ను తాజాగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.
ఇందులో హీరో కమ్ నిర్మాత జేమ్స్ కార్తీక్ (James Karthik) మాట్లాడుతూ.. ‘నేటి సమాజంలో మన కళ్ళ ముందు జరిగే అనేక వాస్తవిక సంఘటనలు ఇందులో ఉన్నాయి. నా నిజ జీవిత కథే. ఇందులో మా అమ్మ పాత్రను ఇనియ పోషించారు. షెడ్యూల్డ్ కులానికి చెందిన నేను చదువుకునే రోజుల్లో జరిగిన అనేక వాస్తవాలను ఇందులో చూపించాం. ఒక్కమాటలో చెప్పాలంటే సనాతన ధర్మంలోని లోపాలను ఎత్తిచూపాం. సినిమా విడుదలైన తర్వాత ఆటంకాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
దర్శకుడు దురై కె.మురుగన్ (Durai K Murugan) మాట్లాడుతూ.. ‘నేటి వాస్తవిక పరిస్థితులకు అద్దంపట్టేలా ఈ సినిమా ఉంటుంది. హీరోగా జేమ్స్‌కు ఇది తొలి చిత్రం కావొచ్చు. కానీ సినిమాపై మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కించామని తెలిపారు. ప్రస్తుతం తమిళ నాట సనాతన ధర్మం గురించి ఎటువంటి చర్చలు నడుస్తున్నాయో తెలియంది కాదు. ఉదయనిధి స్థాలిన్ (Udhayanidhi Stalin) ఈ సనాతన ధర్మంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతూ.. పెద్ద కాంట్రవర్సీగా మారాయి. ఇప్పుడదే పాయింట్‌పై ఈ సినిమా తెరకెక్కినట్లుగా మేకర్స్ చెబుతుండటం చూస్తుంటే.. ఈ సినిమా విడుదల విషయంలో చిక్కులు ఏర్పడే అవకాశాలు అయితే లేకపోలేదు.
ఇవి కూడా చదవండి:
============================
*Gandeevadhari Arjuna: వరుణ్ తేజ్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది..
******************************
*Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ఆ హీరోయిన్ అవుట్..
***********************************
*Vishal: టికెట్ డబ్బులకు సరిపడా వినోదం ఇచ్చినందుకు హ్యాపీ..
**********************************
*Theppa Samudram: కాబోయేవాడు యాడున్నాడో.. మస్త్‌గా ఎక్కుతోన్న మంగ్లీ మాస్ బీట్ సాంగ్
*********************************
*Sai Pallavi: ఇలా తెలుగు ప్రేక్షకులను మళ్లీ కలుస్తున్నందుకు సంతోషంగా ఉంది
*************************************