కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Santhanam: సెప్టెంబర్ 1న కోలీవుడ్‌కి ‘కిక్’ ఇస్తాడా..

ABN, First Publish Date - 2023-08-28T17:27:36+05:30

తాను ఇప్పటివరకు నటించిన చిత్రాలకు భిన్నంగా ‘కిక్‌’ చిత్రం నిలుస్తుందని హీరో సంతానం అన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు తాను పలు చిత్రాల్లో హీరో పక్కన హాస్య నటుడిగా నటించానని, ఈ చిత్రంలో ఆ పాత్రలో తంబి రామయ్య కనిపిస్తారని చెప్పారు. సెప్టెంబర్ 1న విడుదల కాబోతోన్న ఈ చిత్రం ఆడియో లాంచ్‌ను తాజాగా చెన్నైలో నిర్వహించారు.

Kick Movie Still

తాను ఇప్పటివరకు నటించిన చిత్రాలకు భిన్నంగా ‘కిక్‌’ (Kick) చిత్రం నిలుస్తుందని హీరో సంతానం (Santhanam) అన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు తాను పలు చిత్రాల్లో హీరో పక్కన హాస్య నటుడిగా నటించానని, ఈ చిత్రంలో ఆ పాత్రలో తంబి రామయ్య కనిపిస్తారని చెప్పారు. నవీన్‌ రాజ్‌ నిర్మాణంలో ప్రశాంత్‌ రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కిక్‌’. సంతానం, తాన్య హోప్‌ (Tanya Hope), రోహిణి ద్వివేది హీరోహీరోయిన్లు. వీరితో పాటు తంబిరామయ్య, బ్రహ్మానందం, కోవై సరళ, మనోబాలా, మన్సూర్‌ అలీఖాన్‌, కింగ్‌కాంగ్‌, క్రేన్‌ మనోహర్‌, ముత్తుకాళై తదితరులు నటించారు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కినట్లుగా తెలుస్తోంది.


ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో హీరో సంతానం మాట్లాడుతూ... ఒక యువకుడికి, యువతికి మధ్య ఈగో తారా స్థాయిలో ఉంటుంది. అలాంటి ఇద్దరు వ్యక్తులు జీవితంలో కాంప్రమైజ్‌ అయి ఏ విధంగా విజయం సాధించారన్నదే ఈ చిత్ర కథ. ఇందులో తంబి రామయ్యది సినిమా ఆద్యంతం హీరో వెంట ఉంటూ స్ర్కీన్‌ప్లేను ముందుకు తీసుకెళ్లే పాత్ర. ప్రతి సన్నివేశానికి హావభావాలను మార్చేపాత్ర. ఆయన ఈ పాత్రలో అద్భుతంగా నటించారు. (Santhanam About Kick Movie)

ఈ ‘కిక్‌’ చిత్రంలో మరో స్థాయిలో ఉంటుంది. ఇది సంతానం సినిమా అని చెప్పడం కంటే దర్శకుడు ప్రశాంత్‌ రాజ్‌ (Prashant Raj) మూవీ అనడం భావ్యం. ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేశాం. చెన్నైలో షూటింగ్‌ ప్రారంభించి బ్యాంకాక్‌లో పూర్తిచేశాం. సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాం. ప్రేక్షకులందరినీ ఈ చిత్రం అలరిస్తుందనే నమ్మకంతో యూనిట్ అంతా ఉన్నామని అన్నారు. ఇంకా దర్శకుడు ప్రశాంత్‌ రాజ్‌, హీరోయిన్లు, ఇతర నటీనటులు ప్రసంగించారు. ఈ చిత్రానికి అర్జున్‌ జాన్య (Arjun Janya) సంగీతం అందించారు.


ఇవి కూడా చదవండి:

============================

*Tiragabadara Saami Teaser: జై బాలయ్య.. బాలయ్య ఫ్యాన్స్‌కి పండగే..

************************************

*Nandamuri Mokshagna: బాలయ్య వారసుడు ఎట్టున్నడో చూశారా.. పిక్ వైరల్!

*****************************************

*AskSRK: ‘జవాన్’.. మరికొన్ని ఆసక్తికర విషయాలు చెప్పిన బాలీవుడ్ కింగ్ ఖాన్

*****************************************

*Raghava Lawrence: తప్పు జరిగింది.. నన్ను క్షమించండి

*****************************************

*Shivathmika Rajasekhar: మరో తమిళ ఫిల్మ్‌లో ఛాన్స్.. హీరో ఎవరంటే..

*****************************************

Updated Date - 2023-08-28T17:27:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!