కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Samuthirakani: నన్ను సంప్రదించి వుంటే.. అతడిని సినిమాల్లోకి రానిచ్చేవాడిని కాదు

ABN, Publish Date - Dec 27 , 2023 | 09:48 PM

ప్రముఖ వైద్యుడు కె. వీరబాబు సొంతంగా నిర్మించి హీరోగా నటించిన చిత్రం ‘ముడకరుత్తాన్‌’. ఆడియో, ట్రైలర్‌ విడుదల వేడుక తాజాగా చెన్నైలో జరిగింది. వీరబాబు సరసన మహానా నటించారు. సూపర్‌ సుబ్బరాయన్‌, మయిల్‌సామి, బవ లక్ష్మణన్‌, ముత్తుకాళి, వైష్ణవి తదితరులు ఇతర పాత్రలను పోషించారు. ఇందులో ఓ చిన్న పాత్రలో నటించిన సముద్రఖని.. ఆడియో విడుదల కార్యక్రమంలో సంచలన కామెంట్స్ చేశారు.

Samuthirakani

చిత్రపరిశ్రమలో చిన్న చిత్రాల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత వాటిని విడుదల చేయడం గగనంగా మారిందని ప్రముఖ దర్శక, నటుడు సముద్రఖని అన్నారు. ప్రముఖ వైద్యుడు కె. వీరబాబు (K Veerababu) సొంతంగా నిర్మించి హీరోగా నటించిన చిత్రం ‘ముడకరుత్తాన్‌’ (Mudakaruthan). ఆడియో, ట్రైలర్‌ విడుదల వేడుక తాజాగా చెన్నైలో జరిగింది. వీరబాబు సరసన మహానా నటించారు. సూపర్‌ సుబ్బరాయన్‌, మయిల్‌సామి, బవ లక్ష్మణన్‌, ముత్తుకాళి, వైష్ణవి తదితరులు ఇతర పాత్రలను పోషించారు. వాయల్‌ మూవీస్‌ బ్యానరుపై నిర్మితమైన ఈ చిత్రానికి రచన, దర్శకత్వం డాక్టర్‌ కె. వీరబాబు. కెమెరా అరుల్‌ సెల్వన్‌, సంగీతం సిర్పి. రహదారుల్లో ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద భిక్షాటన చేసే చిన్నారుల నేపథ్యంలో పలు ఆసక్తికరమైన మలుపులతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు.


ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సముద్రఖని (Samuthirakani) మాట్లాడుతూ.. ఇందులో చిన్న పాత్రను పోషించా. ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి ముందు వీరబాబు నన్ను సంప్రదించి వుంటే కచ్చితంగా సినిమా నిర్మాణంలో దిగవద్దని ఖరాఖండిగా చెప్పేవాడిని. ఇప్పుడు చిన్న చిత్రాలు నిర్మించిన తర్వాత వాటిని విడుదల చేయడం గగనంగా మారింది. అనేక చిత్రాలు విడుదలకు నోచుకోలేని పరిస్థితి. చెన్నై, హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద కొందరు చిన్నారులు భిక్షాటన చేస్తుంటారు. ఆ పిల్లలు ఎవరు? వారితో ఎవరు భిక్షాటన చేయిస్తున్నారు? ఇలాంటి విషయాలు తలచుకుంటే మనసు బాధగా ఉంటుంది. వీరి బ్యాక్‌డ్రాప్‌లో అద్భుతంగా కథను సిద్ధం చేశారు. నిర్మాణ సమయంలో అనేక ఆటంకాలను అధిగమించారు. నిజానికి వీరబాబు మంచి వైద్యుడు. కరోనా సమయంలో ఆయన సమాజానికి చేసిన వెలకట్టలేనిది. అలాంటి వ్యక్తికి ఈ సమాజం ఎంతో కొంత మేలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తమిళురవి మణియన్‌, సురేష్‌ కామాచ్చి సహా చిత్ర నటీనటులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Dunki: 2023 టాప్ గ్రాస‌ర్ క్ల‌బ్‌లో షారూక్ ‘డంకీ’... వ‌ర‌ల్డ్ వైడ్‌గా కలెక్షన్స్ ఎంతంటే?

***************************

*Saripodhaa Sanivaaram: మళ్లీ యాక్షన్‌లోకి న్యాచురల్ స్టార్..

****************************

*Naveen Medaram: ‘డెవిల్’ సినిమాపై ఎటువంటి చట్టపరమైన చర్యలకి వెళ్లడం లేదు

**************************

*Ravi Teja: ‘హను-మాన్’కి ‘ఈగల్’ సపోర్ట్

***************************

Updated Date - Dec 27 , 2023 | 10:00 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!