కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajinikanth: అందుకే అతను 'తలైవా' అయ్యాడు, ఎవరిని కలిశాడో తెలిస్తే షాకవుతారు

ABN, First Publish Date - 2023-08-29T14:06:30+05:30

వెండితెర మీద వివిధ రకాలైన పాత్రలతో, అభినయంతో లక్షల్లో అభిమానులను సంపాదించుకున్న రజినీకాంత్, నిజ జీవితాల్లో మాత్రం ఒక సాదా సీదా సామాన్య వ్యక్తిలా ప్రవర్తిస్తారు. అందుకే అతన్ని అందరూ తలైవా అని పిలుస్తూ వుంటారు. ఇంతకీ రజినీకాంత్ ఎక్కడ పర్యటించారో తెలుసా...

Rajinikanth visited Jayanagar bus depot in Benguluru

రజినీకాంత్ (Rajinikanth) అంటే వెండి తెర మీద ఒక సూపర్ స్టార్. అతని పేరు లేదా అతన్ని వెండి తెర మీద చూసినప్పుడు అతని అభిమానులు ఈలల తోనూ, చప్పట్ల తోనూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. రజినీకాంత్ కి ఒక్క తమిళ నాడులోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా, భాషతో సంబంధం లేకుండా వేల లోనూ, లక్షల్లోనూ అభిమానులు వున్నారు. అలాగే అతన్ని 'తలైవా' (Thalaivaa) అని పిలుచుకుంటూ వుంటారు. ఆ పేరు కూడా ఎందుకు అతనికి వచ్చిందంటే, అతని వెండి తెర మీద చూపించిన ఆ పోరాట సన్నివేశాలు, అలాగే అతని చేసిన మ్యానరిజమ్స్, అతని చేసిన ఎంచుకున్న పాత్రల వలన అతన్ని 'తలైవా' అని పిలుస్తూ వుంటారు అతని అభిమానులు.

అయితే రజినీకాంత్ వెండి తెర మీద కనిపించినంతగా బయట వుండరు. చాలా సాదా సీదా మనిషిలా, ఒక సామాన్యుడిలా వుంటారు. ఎన్ని కోట్లు గడిచినా, అతను తాను ఒక సామాన్యుడిలానే భవిస్తూ వుంటాను అని చెపుతూ వుంటారు. అందుకే అతను ఏమి చేసినా అది ఒక వార్త, అది మళ్ళీ వైరల్ అవుతూ ఉంటుంది.

రజినీకాంత్ ఎక్కువ ఆధ్యాత్మికంలో కూడా ఉంటూ వుంటారు. ఒక్కోసారి హిమాలయాలకు వెళ్లి వస్తూ వుంటారు, అక్కడ ఎక్కువసేపు కాలం గడుపుతూ వుంటారు, అలాగే అతను రియల్ లైఫ్ లో ఎలా వుంటారో అలానే బయటకి రావటానికి ఇష్టపడతారు. సినిమా జీవితాన్ని, తన సహజ జీవితాన్ని ఎప్పుడూ కలిపి చూడరు. కొన్ని రోజుల క్రితం (UPChiefMinister) ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ (YogiAdityanath) కాళ్ళకి రజినీకాంత్ మొక్కడం పెద్ద వార్త అయింది. దానికి తాను యోగి, సన్యాసి కనిపించినప్పుడు అలాగే చేస్తాను అని వివరణ ఇచ్చారు.

ఇప్పుడు రజినీకాంత్ తను ఎక్కడ నుండి వచ్చాడో ఎప్పుడూ మర్చిపోరు. అందుకే అతను తలైవా అయ్యాడు. ఈరోజు బెంగుళూరు లోని జయానగర్ బస్సు డిపో ని సందర్శించారు రజినీకాంత్. ఎందుకంటే సినిమాల్లోకి రాకముందు రజినీకాంత్ బస్సు కండెక్టర్ గా జీవితాన్ని మొదలెట్టారు. అందుకనే ఎప్పుడు అవకాశం వచ్చినా ఒకసారి ఆ బస్సు డిపోకు వెళ్లి అక్కడ వున్న కండక్టర్లు ని ఇతర స్టాఫ్ ని పలకరించి వస్తూ వుంటారు. ఈరోజు కూడా అలాగే వెళ్లి అక్కడ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు రజినీకాంత్. ఈమధ్య విడుదలైన రజినీకాంత్ సినిమా 'జైలర్' #Jailer కొత్త రికార్డ్స్ సృష్టించే దిశగా విజయవంతంగా దూసుకుపోతోంది. నెల్సన్ (NelsonDileepKumar) దీనికి దర్శకుడు.

Updated Date - 2023-08-29T14:06:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!