Rajinikanth: నా పేరు వాడుకుంటే చర్యలు.. కంపెనీలకి సూపర్‌స్టార్ హెచ్చరికలు
ABN, First Publish Date - 2023-01-29T15:03:14+05:30
భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ స్టార్లలో రజనీకాంత్ (Rajinikanth) ఒకరు.
భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ స్టార్లలో రజనీకాంత్ (Rajinikanth) ఒకరు. ఆయనకి ఉన్న స్టార్‌డమ్ దృష్ట్యా ఎన్నో కంపెనీలు ఆయన కార్టూన్లని, డైలాగులకి కాపీ కొడుతూ తమ ప్రమోషన్ల కోసం వాడుకుంటాయి. తాజాగా అలాంటి కంపెనీలకు రజనీకాంత్ హెచ్చరికలు జారీ చేశాడు.
రజనీకాంత్ తరపున న్యాయవాది సుబ్బయ్య ఎళంభరతి (Subbiah Elambharathi) తాజాగా ఓ లేఖని విడుదల చేశారు. అందులో.. ‘ఏవైనా బ్రాండ్లు రజనీకాంత్‌కి సంబంధించి యాటిట్యూడ్, పబ్లిసిటీ, సెలబ్రిటీ హక్కులను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వాటన్నింటి మీద రజనీకి మాత్రమే హక్కులు ఉన్నాయి. అందుకే ఆయన పేరుని, గొంతుని మిమిక్రీ చేయడం, ఆయనకి సంబంధించిన దేన్ని కంపెనీల ప్రమోషన్స్ కోసం వాడకూడదు. అలాంటివి నా క్లైంట్ (రజనీ) ప్రతిష్టకి లేదా వ్యక్తిత్వానికి భంగం కలిగించవచ్చు. దీని ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం ప్రొసిడింగ్స్ ఉంటాయి’ అని రాసుకొచ్చారు.
కాగా.. రజనీకాంత్ చివరి సారిగా ‘పెద్దన్న’ సినిమాలో కనిపించారు. ఆయన పస్తుతం యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ అనే సినిమాలో నటిస్తున్నారు.