కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajinikanth: యోగి ఆదిత్యనాథ్ కాళ్ళకి మొక్కడంపై రజిని వివరణ ఇచ్చేసారు, ఏమన్నారంటే...

ABN, First Publish Date - 2023-08-22T12:11:13+05:30

72 ఏళ్ల వయసున్న సూపర్ స్టార్ రజినీకాంత్, 51 సంవత్సరాల వయసున్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాళ్ళమీద పది మొక్కడం ఏంటని సాంఘీక మాధ్యమంలో వైరల్ అయింది. అయితే నిన్న ఈ సంఘటనపై రజినీకాంత్ స్పందించి, తనదైన రీతిలో తగిన సమాధానం ఇచ్చారు.

Rajinikanth touches the feet of UP Chief Minister Yogi Adityanath.

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) వార్తల్లో వున్నారు. ఒకటి అతని సినిమా 'జైలర్' #Jailer భారీ విజయం సాధించటమే కాకుండా, ప్రపంచం అంతటా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చాలా సంవత్సరాల తరువాత రజినీకాంత్ ఒక ఘన విజయాన్ని అందుకోవటమే కాకుండా, వున్న పాత రికార్డ్స్ అన్నీ చెరిపేసి కొత్త రికార్డ్స్ సృష్టించే దిశగా ఈ సినిమా దూసుకుపోతోంది. ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ గా ఉండటమే అందుకు కారణం.

ఇక రెండో కారణం అతను కొన్ని రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్ (UttarPradesh) పర్యటించినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (YogiAdityanath) ని కలిసినప్పుడు అతని కాళ్ళకి రజినీకాంత్ సాష్టాంగ నమస్కారం చేశారు. దీని మీద సాంఘీక మాధ్యమాలు అన్నీ విపరీతంగా ట్రోల్ చేశాయి. రజినీకాంత్ వయసు ఏంటి, ఆదిత్యనాధ్ (UPChiefMinister) వయసు ఏంటి, ఆలా ఎలా రజినీకాంత్ చేస్తారు అని ఒకటే ట్రోల్ చేశారు సాంఘీక మాధ్యమాల్లో. ఇది కొంచెం వివాదాస్పదంగా కూడా మారింది. (Rajinikanth touches Yogi Adityanath feet)

లక్నోలో ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ని కలుసుకోవడానికి అతని ఇంటికి వెళ్ళినప్పుడు, రజినీకాంత్ ని రిసీవ్ చేసుకునేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బయటకి వచ్చారు, అప్పుడు వెంటనే రజినీకాంత్ అతని కాళ్ళను తాకడానికి వంగడం, ఆదిత్యనాథ్ వెంటనే రజనీకాంత్ ని ఆలా వద్దని చెప్పేలోపే రజినీకాంత్ ఆయన పాదాలకు నమస్కారం చేయడం జరిగింది. అక్కడే ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్లు ఈ సన్నివేశానికి సంబంధించి చిత్రీకరించటం, బయటకి పంపటం, ఆ తరువాత అవి సోషల్ మీడియా లో వైరల్ అవటం అందరికీ తెలిసిన విషయమే.

అయితే ఇప్పుడు రజినీకాంత్ తన పర్యటనలు అన్నీ ముగించుకొని నిన్న చెన్నై వచ్చారు. అక్కడ ఎయిర్ పోర్ట్ లో దిగగానే పత్రికా విలేకరులు అందరూ ఈ వైరల్ అయినా ప్రశ్ననే రజనీకాంత్ ని అడగటం జరిగింది. దీనికి రజినీకాంత్ తనదైన రీతిలో స్పందించారు. "ఎవరైనా స్వామీజీ కానీ యోగి కానీ నాకు ఎదురుపడితే వాళ్ళు నాకంటే చిన్నవారైనా వారి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకోవటం నా పద్ధతి," అంటూ చెప్పి ఇక దానిమీద మరి చర్చ అనవసరం అన్నట్టుగా వెళ్లిపోయారు. ఇలా అయన చెప్పడంతో ఆ విషయం మీద అందరికీ ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా అయింది. రజిని అభిమానులు కూడా ఇప్పుడు రజిని చెప్పిందాంట్లో తప్పేముంది, అందులో నిజం వుంది కదా అంటూ ఇప్పుడు రజిని చెప్పిన మాటలని వైరల్ చేస్తున్నారు. Rajinikanth clarifies why he touched the feet of Chief Minister Yogi Adityanath.

Updated Date - 2023-08-22T12:11:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!