Vishal: అదోరకం సనాతన ధర్మం.. విశాల్ వ్యాఖ్యలకు నిర్మాత కౌంటర్
ABN, First Publish Date - 2023-09-27T17:19:20+05:30
ప్రస్తుత పరిస్థితుల్లో మూడు, నాలుగు కోట్ల రూపాయలను చేతిలో పెట్టుకుని సినిమా తీసేందుకు రావొద్దంటూ హీరో విశాల్ చేసిన వ్యాఖ్యలపై ‘ఎనక్కు ఎండే కిడైయాదు’ చిత్ర నిర్మాత కార్తీక్ వెంకట్రామన్ కౌంటర్ ఇచ్చారు. ఇదో రకం సనాతన ధర్మం అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మూడు, నాలుగు కోట్ల రూపాయలను చేతిలో పెట్టుకుని సినిమా తీసేందుకు రావొద్దంటూ హీరో విశాల్ (Hero Vishal) చేసిన వ్యాఖ్యలపై ‘ఎనక్కు ఎండే కిడైయాదు’ చిత్ర నిర్మాత కార్తీక్ వెంకట్రామన్ (Karthik Venkatraman) కౌంటర్ ఇచ్చారు. ఇదో రకం సనాతన ధర్మం అంటూ వ్యాఖ్యానించారు. హంగ్రీ వూల్ఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పీ బ్యానరుపై నిర్మాత కార్తీక్ వెంకట్రామన్ నిర్మాణ సారథ్యంలో నిర్మించిన చిత్రం ‘ఎనక్కు ఎండే కిడైయాదు’. డెబ్యూ డైరెక్టర్ విక్రమ్ రమేష్ (Vikram Ramesh) దర్శకత్వం వహించారు. కథ, స్ర్కీన్‌ప్లే, మాటలను సమకూర్చిన ఆయన ఈ చిత్రంలోని ఓ ప్రధాన పాత్రను కూడా పోషించారు. నిర్మాత కార్తీక్ వెంకట్రామన్ కూడా మరో ప్రధాన పాత్రలో నటించారు. స్వయంసిద్ధ హీరోయిన్. శివకుమార్ రాజు, మురళి శ్రీనివాసన్, శక్తివేల్ తదితరులు ఇతర పాత్రలను పోషించిన ఈ చిత్రానికి కెమెరా దళపతి రత్నం, సంగీతం కళాచరణ్ అందించారు. వచ్చే నెల 6న ఈ చిత్రం విడుదలకానుంది. తాజాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను చెన్నైలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత కార్తీక్ వెంకట్రామన్ మాట్లాడుతూ... ముగ్గురు నటుల మధ్య జరిగే చిన్న పోరాటమే ఈ స్టోరీ. రూ.3, 4 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తీసేందుకు ఎవరూ రావొద్దంటూ హీరో విశాల్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సహేతుకంగా లేవు. ఇలా చెప్పేందుకు ఎవరికీ హక్కు లేదు. ఇంకా చెప్పాలంటే విశాల్ మాటలు వింటుంటే.. ఇదో రకం సనాతన ధర్మం అని అనాలని అనిపిస్తుంది. సినిమా బడ్జెట్‌కు పరిధి ఉండదు. రూ. 1 కోటితో కూడా సినిమా చేయవచ్చు.. రూ. 100 కోట్లు అంతకంటే ఎక్కువ పెట్టి కూడా సినిమా చేయవచ్చు. కథ, ఆర్టిస్ట్‌ల డిమాండ్‌ని బట్టి బడ్జెట్ ఉంటుంది. విశాల్ మాట్లాడింది కరెక్ట్ కాదని అన్నారు. ‘ఎనక్కు ఎండే కిడైయాదు’ (Enaku End Eh Kedaiyathu) గురించి మాట్లాడుతూ.. సినిమా బాగా వచ్చిందని, అందరినీ అలరిస్తుందని చెప్పుకొచ్చారు.
దర్శకుడు విక్రమ్ రమేష్ మాట్లాడుతూ.. ఒక చిత్రానికి కావాల్సింది మంచి కథ, మంచి నిర్మాణ సంస్థ. ఈ రెండు ఉంటే ఎవరైనా సినిమా తీయవచ్చు. ‘ఎనక్కు ఎండే కిడైయాదు’ చిత్రంలో మంచి కథతో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అలాగే మంచి నిర్మాణ సంస్థలో, ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమాని రూపొందించడం జరిగిందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
============================
*Tiger Nageswara Rao: టైగర్ కా హుకుమ్.. ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది
***********************************
*Skanda: అడుగడుగునా బోయపాటి మార్క్.. చూసుకుందాం.. బరాబర్ చూసుకుందాం
***************************************
*Hebah Patel: హెబ్బా నటించిన మిస్టరీ థ్రిల్లర్ డైరెక్ట్‌గా ఓటీటీలోకే.. ఎప్పుడు, ఎక్కడంటే?
****************************************
*Salaar: రెబల్ స్టార్ ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. షారుఖ్‌కి ఝలక్!
***************************************