Producer: ఆ శక్తిసామర్థ్యాలుంటేనే సినిమా తీయండి
ABN, First Publish Date - 2023-12-02T22:03:13+05:30
సినిమా తీయడం ముఖ్యం కాదని, దాన్ని విడుదల చేయగల శక్తిసామర్థ్యాలు ఉండాలని ప్రముఖ సీనియర్ నిర్మాత కె.రాజన్ నిర్మాతలకు సూచించారు. సింగపూర్‌కు చెందిన కృష్ణమణి నిర్మాణంలో ప్రైం రిలీజ్ సమర్పణలో డెబ్యూ డైరెక్టర్ కృష్ణరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘యమగాతకన్’. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సినిమా తీయడం ముఖ్యం కాదని, దాన్ని విడుదల చేయగల శక్తిసామర్థ్యాలు ఉండాలని ప్రముఖ సీనియర్ నిర్మాత కె.రాజన్ నిర్మాతలకు సూచించారు. సింగపూర్‌కు చెందిన కృష్ణమణి నిర్మాణంలో ప్రైం రిలీజ్ సమర్పణలో డెబ్యూ డైరెక్టర్ కృష్ణరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘యమగాతకన్’. మనోజ్, రష్మిక తివారీ హీరోహీరోయిన్లు. సతీష్ ప్రతినాయకుడి పాత్రను పోషించగా.. అనుష్క ముఖ్య పాత్రలో నటించారు. విఘ్నేష్ రాజా సంగీతం. ఈ చిత్ర ఆడియోను తాజాగా చెన్నైలో విడుదల చేశారు. సీనియర్ నటుడు ఎస్వీ.శేఖర్, సీనియర్ నిర్మాత కె.రాజన్, దర్శకుడు తిరుమలై, నటుడు సౌందర్‌రాజన్, దర్శకుడు చక్రవర్తి సహా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత కె.రాజన్ (K Rajan) మాట్లాడుతూ.. అనేక చిన్న బడ్జెట్ చిత్రాలు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత విడుదల కావడం లేదు. విక్రమ్ వంటి స్టార్ హీరో నటించిన ‘ధృవనక్షత్రం’ విడుదలకు కూడా ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఒక యేడాదిలో కేవలం 30 పెద్ద సినిమాలు మాత్రమే ఉంటాయి. కానీ, చిన్న సినిమాలు వందల సంఖ్యలో ఉంటాయి. వీటిలో అనేక చిత్రాలు విడుదలకు నోచుకోవడం లేదు. అందువల్ల ఒక చిత్రాన్ని నిర్మించిన తర్వాత దాన్ని విడుదల చేయగల స్థోమత, శక్తిసామర్థ్యాలు ఉన్నాయని భావిస్తేనే సినిమాను నిర్మించాలని సూచించారు.
సీనియర్ నటుడు ఎస్వీ శేఖర్ (SV Sekhar) మాట్లాడుతూ.. దర్శకుడు అమీర్‌ను ఉద్దేశించి నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణ కోరడమే సరైనది. అలాగే, జ్ఞానవేల్ రాజా మాట్లాడిన వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించాలని కోరారు. చిత్ర దర్శకుడు కృష్ణరాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా పూర్తిగా నిర్మాతకు తెలుసు. నేను కేవలం ఔట్‌లైన్ మాత్రమే చెప్పా. నామీద నమ్మకంతో పెట్టుబడి పెట్టి సినిమా నిర్మించినందుకు ధన్యవాదాలని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Dil Raju: ‘యానిమల్’ తరహా చిత్రాలను నేను కూడా నిర్మిస్తా.. కాకపోతే?
*************************************
*Nithiin: నేను సపోర్ట్ చేస్తే.. పవర్ స్టార్ గెలిచేస్తారా?
***********************************
*Pindam Movie: సినిమాకు ‘పిండం’ అని టైటిల్ పెట్టడానికి కారణమిదేనట..
***************************************