సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

PS2: ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ ప్రత్యేక షోలు రద్దు.. సినిమాపై చిత్రయూనిట్ స్పందనిదే..

ABN, First Publish Date - 2023-04-28T12:35:51+05:30

ఈ చిత్రం కోసం ప్రచార కార్యక్రమాలను చెన్నైలో ప్రారంభించిన ‘పీఎస్‌-2’ (PS2) బృందం.. చివరి ప్రమోషన్‌ను కూడా చెన్నైలోనే గురువారంతో ముగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో

Jayam Ravi in PS2
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ (Ponniyin Selvan 2) చిత్రాన్ని నేడు (శుక్రవారం) మేకర్స్ గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం కోసం ప్రచార కార్యక్రమాలను చెన్నైలో ప్రారంభించిన ‘పీఎస్‌-2’ (PS2) బృందం.. చివరి ప్రమోషన్‌ను కూడా చెన్నైలోనే గురువారంతో ముగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరోలు విక్రమ్‌, కార్తీ, జయం రవి, పార్తీబన్‌, హీరోయిన్లు త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల, లైకా ప్రొడక్షన్‌ హెడ్‌ జీకేఎం తమిళ్‌ కుమరన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read Also: Agent Film Review: అయ్యగారి ఏజెంట్ ఎలా ఉందంటే...


ఇందులో పాల్గొన్న నటీనటులు మాట్లాడుతూ.. ‘‘ఎందరో గొప్ప నటీనటులు నటించాలని భావించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాం. గత మూడేళ్ళుగా ఈ ప్రాజెక్టు కోసం ఒక కుటుంబ సభ్యులుగా కలిసి ప్రయాణించాం. ఇంతకాలం ఈ చిత్రం భారాన్ని భుజస్కంధాలపై మోశాం. ఇపుడు ప్రేక్షకుల చేతుల్లో పెట్టాం. వారే న్యాయనిర్ణేతలు’ అని అన్నారు. ఐశ్వర్య లక్ష్మి ఒక దశలో తీవ్ర భావోద్వేగానికి లోనై వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు. పీఎస్‌ జర్నీ జీవితంలో మరిచిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు. (Artists Response on Ponniyin Selvan 2)

పార్తీబన్‌ మాట్లాడుతూ.. ‘మణిరత్నం అధికంగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. కానీ, ఈ చిత్రం కోసం ఆయన విలేకరులతో ఎన్నో విషయాలు షేర్‌ చేశారు అని అన్నారు. హీరో కార్తీ మాట్లాడుతూ.. ‘మణిరత్నం ‘పీఎస్’లో నాకు ఇచ్చిన పాత్రకు అహర్నిశలు శ్రమించి పూర్తి న్యాయం చేశానని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను’ అని చెప్పారు. హీరో విక్రమ్‌ మాట్లాడుడూ.. ‘ఈ సినిమా షూటింగ్‌లో ప్రతి ఒక్కరం కుటుంబ సభ్యుల్లా, సోదర భావంతో మెలుగుతూ, స్నేహితుల్లా కలిసిపోయినట్టు చెప్పారు. ఈ జర్నీ చిరస్మరణీయం’ అని అన్నారు. అలాగే, త్రిష, ఐశ్వర్యలక్ష్మి, శోభిత, పార్తీబన్‌ తదితరులు ప్రసంగించారు. ఇదిలావుంటే ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని ప్రత్యేక షోల (Special Show) ప్రదర్శనకు తమిళ నాడు రాష్ట్ర ప్రభుత్వం (Tamil Nadu Government) అనుమతివ్వలేదు. దీంతో ‘పీఎస్‌-2’ చిత్రం ప్రత్యేకషోలు ప్రదర్శించకపోవడంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*‘PS2’ Twitter Review: ‘బాహుబలి’‌ సరిపోదు.. ఇండియన్ సినిమా గర్వపడే చిత్రమిది

*Agent Twitter Review: అయ్యగారి సినిమా టాక్.. ఏదో తేడాగా ఉందే..?

*Surender Reddy Universe: ‘ఏజెంట్’లో ‘ధృవ’.. వీడియో అదిరింది

Updated Date - 2023-04-28T12:35:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!