The Elephant Whisperers: ఆస్కార్‌కి కారణమైన ఆ జంటకి ప్రధాని సర్‌ప్రైజ్
ABN, First Publish Date - 2023-04-06T15:16:41+05:30
సినీ ప్రపంచంలో ఆస్కార్స్‌కి ఉన్న విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ అవార్డును ఒక్కసారైన అందుకోవాలని ప్రతి సినీ సెలబ్రిటీ కోరుకుంటాడు.
సినీ ప్రపంచంలో ఆస్కార్స్‌కి ఉన్న విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ అవార్డును ఒక్కసారైన అందుకోవాలని ప్రతి సినీ సెలబ్రిటీ కోరుకుంటాడు. అలాంటిది మనదేశాని ఈ ఏడాది రెండు ఆస్కార్లు దక్కాయి. అందులో, ఒకటి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ (RRR)లోని ‘నాటు నాటు’ పాటకి రాగా.. రెండోది ‘బెస్ట్ డాక్యుమెంటరీ’ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ (The Elephant Whisperers) దక్కించుక్కుంది. దీంతో ఆ డాక్యుమెంటరీ తీసిన నిర్మాత గునీత్ మోంగకి, దర్శకురాలు కార్తికి గోన్స్లేవ్, ఏనుగులు రఘు, అమ్ముతో పాటు ఇందులో ముఖ్య పాత్రలైన బొమ్మన్, బిల్లీ జంటకి కూడా మంచి గుర్తింపు లభించింది.
ఈ అవార్డుతో వారిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. చాలామంచి చిత్రం అని పొగడ్తలు కురిపించారు. అయితే.. తాజాగా ఈ ఆస్కార్ జంట బొమ్మన్, బిల్లీకి ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) ఓ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారు. ఈ వారంలో ప్రధాని దక్షిణ భారతదేశంలోని మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 9న తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్‌ను సందర్శిస్తారు.
Read Also:
Game Changer: బాబాయ్ ఛాన్స్‌ని కొట్టేసిన అబ్బాయ్.. రామ్‌చరణ్‌కి ఎవరి వల్ల సెట్ అయ్యిందంటే..
ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇప్పటికే నీలగిరి జిల్లాలోని ముదుమలై టైగర్ రిజర్వ్ (Mudumalai Tiger Reserve) పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలోనే ప్రధాని మోదీ ఎంటీఆర్‌లోని తెప్పకాడు ఏనుగు శిబిరాన్ని సందర్శిస్తారు. అలాగే.. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ స్టార్స్ బొమ్మన్, బెల్లీతో కూడా సంభాషించనున్నారు. ఈ విషయం తెలిసిన ఈ జంట చాలా సంతోషంలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని రెండు రోజుల పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పర్యటించనున్నారు. (PM Modi to Talk Bomman and Bellie)
‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కథేంటంటే..
బొమ్మన్ (Bomman), బెల్లి (Bellie) అనే జంట తల్లి చనిపోయిన గున్న ఏనుగులను పెంచి పోషించి, వాటి ఆలనా పాలన చూసుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగా.. వారి దగ్గర రఘు అనే మగ ఏనుగు, అమ్ము అని ఆడ ఏనుగు పెరుగుతాయి. ఈ తరుణంలోనే ఆ ఏనుగులతో ఈ జంటకి చాలా మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఈ జంట ఆ ఏనుగులను సొంత బిడ్డల సాకుతారు. ఇది గమనించిన దర్శకురాలు కార్తికీ గొన్సాల్వేస్, నిర్మాత గునీత్ మోంగా కలిసి ఈ డాక్యుమెంటరీని నిర్మించారు. అదే ఇప్పుడే వారికి ఆస్కార్‌ని తెచ్చి పెట్టింది.
ఇవి కూడా చదవండి:
YRF: హాలీవుడ్‌ని ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఆ ఇద్దరు స్టార్స్ కొట్టుకుంటే చూడాలని..
Adipurush: మరోసారి చిక్కుల్లో ప్రభాస్ మూవీ.. మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ..
Bholaa: సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టి.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న బాలీవుడ్ స్టార్!?