Bharathiraja: ప్రేమ లేకుంటే జీవితం లేదు
ABN, First Publish Date - 2023-05-13T19:28:31+05:30
ప్రేమ లేకుంటే జీవితమే లేదు. నేను 9వ తరగతి చదివే సమయంలోనే నాకు ఓ ప్రియురాలు ఉండేది. ఆ తర్వాత చెన్నైకు వచ్చాక
ప్రేమ (Love) లేకుంటే జీవితం (Life) లేదని ప్రముఖ దర్శక దిగ్గజం, నటుడు భారతీరాజా (Bharathiraja) అన్నారు. తనకు 9వ తరగతిలోనే ప్రియురాలు ఉండేదని చెప్పారు. రితూ వర్మ, వాసుదేవన్ మురళి, వసుంధర, కిషోర్, విజయలక్ష్మి, పీబీ తదితరులు నటించిన చిత్రం ‘మోడ్రన్ లవ్’. ఒక ఆంత్రాలజీ మూవీ. గతంలో ‘మోడ్రన్ లవ్ ముంబై’, ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ వంటి సిరీస్‌లు విడుదలై ఆదరణ పొందాయి. ఇపుడు ఇదే బాణీలో తెరకెక్కించిన చిత్రం ‘మోడ్రన్ లవ్ చెన్నై’ (Modern Love Chennai).
భారతీరాజా, బాలాజీ శక్తివేల్, త్యాగరాజన్ కుమారరాజా, రాజామురుగన్, కృష్ణకుమార్ ప్రేమ్‌కుమార్, అక్షయ్ సుందర్ దర్శకులు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా, జీవీ ప్రకాష్ కుమార్, శ్యాన్ రోల్డన్ సంగీత దర్శకులు. బాలాజీ ధరణీధరన్, రాజుమురుగన్, రేష్మ ఘటాల, ప్రతాప్ కుమార్ ఎస్, త్యాగరాజన్ కుమారరాజా కథలను సమకూర్చారు. ఈ నెల 18నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కానున్న ఈ చిత్రానికి నిర్మాతలు టేలర్ డుర్డెన్, ఖినో ఫిస్ట్. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ రిలీజ్ వేడుక తాజాగా చెన్నైలో జరిగింది.
ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీరాజా (Bharathiraja) మాట్లాడుతూ.. ఈ సినిమా ద్వారా త్యాగరాజ కుమారరాజ అనే ఒక మంచి స్నేహితుడిని పొందగలిగా. ప్రేమ లేకుంటే జీవితమే లేదు. నేను 9వ తరగతి చదివే సమయంలోనే నాకు ఓ ప్రియురాలు ఉండేది. ఆ తర్వాత చెన్నైకు వచ్చాక ఇన్నేళ్లలో నాలుగు మంచి ప్రేమలను పొందాను. ఆ ప్రియురాళ్ళను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నా. నాకు నీడనిచ్చిన గొడుగులు వారు. నేను చనిపోయేలోపు ఒక మంచి చిత్రానికి దర్శకత్వం వహించాలనివుందని భారతీరాజా అన్నారు. అలాగే, చిత్ర యూనిట్ సభ్యులు కూడా ప్రసంగించారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Charmme Kaur: దిమాఖ్ ఖరాబ్ అనౌన్స్మెంట్ అంటోంది.. మరి ‘లైగర్’ సంగతేంటి?
*BoyapatiRAPO: పోస్టర్ అదిరింది.. ఫస్ట్ థండర్ ఎప్పుడంటే..?
*PVT04: ‘చిత్ర’గా శ్రీలీల.. లుక్ విడుదల
*Ustaad Bhagat Singh: బాబాయ్ మూవీ గ్లింప్స్‌పై అబ్బాయ్ రియాక్షన్ ఇదే..
*Bandla Ganesh: బానిసత్వానికి భాయ్ భాయ్.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తా..
*SPY: నిఖిల్ ‘స్పై’ టీజర్‌ని ఎక్కడ విడుదల చేస్తున్నారో తెలుసా?
*Ileana: బంప్ అలెర్ట్.. అంటూ ఇలియానా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ