#ThalapathyVijay: దిల్ రాజును ఆడుకుంటున్న నెటిజన్లు
ABN, First Publish Date - 2023-01-04T12:43:16+05:30
దిల్ రాజు వచ్చి రాని తమిళం లో కొన్ని ఆంగ్ల పదాలు జోడించి మాట్లాడేడు. అయితే అవి అక్కడికి వచ్చిన జనాలకి, టి.వి. లో చూస్తున్న ప్రేక్షకులకు ఎంత అర్థ్యం అయిందో తెలియదు కానీ, సాంఘీక మాధ్యమాల్లో మాత్రం దిల్ రాజు ని ఆడుకుంటున్నారు.
ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు (Popular producer Dil Raju) తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తో 'వారిసు' (#Varisu) తమిళ సినిమా తీస్తున్నాడు (Tamil Superstar #ThalapathyVijay). దీనికి తెలుగు దర్శకుడు పైడిపల్లి వంశీ దర్శకత్వం (Director Paidipalli Vamsi) వహిస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో కూడా 'వారసుడు' (#Varasudu) డబ్బింగ్ సినిమాగా విడుదల అవుతోంది. అయితే ఈమధ్య ఈ సినిమా తమిళ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ చెన్నై (Pre-release event happened in Chennai) లో పెట్టారు. విజయ్ తమిళ సూపర్ స్టార్ కాబట్టి, అతనికి చాలా పెద్ద ఫాలోయింగ్ వుంది. ఆ ఫంక్షన్స్ లో దిల్ రాజు వచ్చి రాని తమిళం లో కొన్ని ఆంగ్ల పదాలు జోడించి మాట్లాడేడు. అయితే అవి అక్కడికి వచ్చిన జనాలకి, టి.వి. లో చూస్తున్న ప్రేక్షకులకు ఎంత అర్థ్యం అయిందో తెలియదు కానీ, సాంఘీక మాధ్యమాల్లో మాత్రం దిల్ రాజు ని ఆడుకుంటున్నారు.
అసలు దిల్ రాజు ఏమి చెప్పాలి అనుకుంటున్నాడో అతనికి అయినా తెలుసా అన్న చందాన మాట్లాడేడు దిల్ రాజు. రాకపోతే తెలుగులోనే మాట్లాడవచ్చు కదా, తమిళనాడు (Tamil Nadu) లో తెలుగు చాలామందికి అర్థం అవుతుంది కదా. హిందీ, కన్నడ, మలయాళం వాళ్ళకి తెలుగు రాకపోతే వాళ్ళ బాషలోనే మాట్లాడేస్తున్నారు కదా. యాంకర్ సుమ (Anchor Suma) తాను చేసిన ఎన్నో ఫంక్షన్స్ లో చాలామందికి దుబాసీ గా వ్యవహరించింది కదా. దుబాసీ అంటే, వాళ్ళ స్వంత భాషలో మాట్లాడితే సుమ వాటిని తెలుగులోకి అనువాదం చేసి చెప్పటం.
ఆలా దిల్ రాజు కూడా తెలుగులో మాట్లాడి ఉంటే సరిపోయేది కదా. రాని భాష అయిన తమిళం లో మాట్లాడాలనుకోవటం వలన ఏమి చెప్పాలో అది సరిగ్గా చెప్పలేకపోయాడు, సరికదా, నెటిజెన్లకి బాగా దొరికిపోయాడు. ఆసక్తికరం ఏంటి అంటే, దిల్ రాజు లాంటి తెలుగు చలన చిత్ర సీమలో వున్న చాలామంది తెలుగు సినిమా ఫంక్షన్స్ లో కూడా తెలుగు రానట్టుగా ఆంగ్లం ఎక్కువ మాట్లాడటం జరుగుతోంది. మరి చెన్నై లో ఆంగ్లం మాట్లాడవచ్చు కదా, అంటే కుదరదు అక్కడ ఒప్పుకోరు జనాలు. ఎంతవారలు అయినా గానీ, తమిళ భాషలోనే మాట్లాడాలి. రాకపోయినా కూడా. లేదా వాళ్ళ మాతృభాష లో మాట్లాడాలి. దిల్ రాజు రెండిటికి చెడ్డ రేవడిలా అయన ఏమి మాట్లాడేదో ఆయనకే అర్థం కానట్టుగా మాట్లాడేడు.