కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Namitha Husband: పోలీసుల విచారణకు హాజరుకాని నటి నమిత భర్త.. లేఖలో ఏం చెప్పారంటే?

ABN, First Publish Date - 2023-11-16T11:36:51+05:30

కేంద్రప్రభుత్వం పేరు చెప్పి నగదు మోసం చేసిన కేసులో విచారణకు హాజరుకావాలంటూ హీరోయిన్‌ నమిత భర్త వీరేంద్ర చౌదరి, బీజేపీ నాయకుడు మంజునాథ్‌కు సేలం సైబర్‌ జిల్లా పోలీసులు నోటీసులు పంపించగా, వారు గైర్హాజరయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని, అందువల్ల విచారణకు హాజరుకాలేమని వారు పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Namitha and Her Husband Virendra Chaudhary

కేంద్రప్రభుత్వం పేరు చెప్పి నగదు మోసం చేసిన కేసులో విచారణకు హాజరుకావాలంటూ హీరోయిన్‌ నమిత భర్త (Namitha Husband) వీరేంద్ర చౌదరి (Virendra Chaudhary), బీజేపీ నాయకుడు (BJP Leader) మంజునాథ్‌కు సేలం సైబర్‌ జిల్లా పోలీసులు నోటీసులు పంపించగా, వారు గైర్హాజరయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని, అందువల్ల విచారణకు హాజరుకాలేమని వారు పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

మదురై జిల్లా ఉసిలంపట్టికి చెందిన ముత్తురామన్‌ (60) ఎంఎస్ఎఈ (MSAE) ప్రమోషన్‌ కౌన్సిల్‌ను ప్రారంభించి ఆ సంస్థకు జాతీయ నేతగా ప్రకటించుకున్నారు. ఇది ఒక కేంద్ర సంస్థగా ప్రచారం చేసి, ఈ సంస్థ కార్యదర్శిగా పంజాబ్‌కు చెందిన దుష్యంత్‌ అనే వ్యక్తిని నియమించారు. ఈ సంస్థకు తమిళనాడు అధ్యక్షుడిగా హీరోయిన్‌ నమిత భర్త వీరేంద్ర చౌదరిని నియమించారు. అయితే, 15 రోజుల క్రితం ఈ సంస్థ సమావేశం సేలంలో జరిగింది. ఇందులో జాతీయ జెండాతో పాటు రాజముద్రను కూడా ఉపయోగించారు. దీంతో నిజంగానే ఇది కేంద్రప్రభుత్వ సంస్థేనా అనే సందేహం రావడంతో ఈ సంస్థ వ్యవహారంపై ఆరా తీయాలని సూరామంగళం పోలీసులకు కొందరు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. ఈ విచారణలో ఈ సంస్థ పేరుతో మోసం చేస్తున్నట్టు తేలడంతో ముత్తురామన్‌ (Muthuraman), దుష్యంత్‌ (Dushyant)ను అరెస్టు చేశారు.


ఈ నేపథ్యంలో ఈ సంస్థ తమిళనాడు విభాగ అధ్యక్షుడి పదవి కోసం రూ.50 లక్షలు ఇచ్చి మోసపోయినట్టు సేలంకు చెందిన గోపాలస్వామి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాదయాత్రకు కోటి రూపాయలు ఇచ్చినట్టు ముత్తురామన్‌ మాట్లాడిన ఆడియో ఒకటి విడుదలైంది. ఇది రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈ తమిళనాడు సంస్థ అధ్యక్షుడిగా ఉన్న నమిత భర్తతో పాటు బీజేపీ నిర్వాహకుడు మంజునాథ్‌ వద్ద విచారణ జరిపేందుకు వారికి పోలీసులు నోటీసులు పంపించారు. మంగళవారం రాత్రి హాజరుకావాలని ఆదేశించారు. కానీ, వీరిద్దరూ పోలీసులు ఎదుట హాజరుకాలేదు.


ఇవి కూడా చదవండి:

========================

*Karthika Nair: రాధ కుమార్తె కార్తీక నాయర్ పెళ్లాడబోయే వ్యక్తి ఇతనే..

**********************************

*Mehreen Pirzada: అదే నాకు ‘స్పార్క్’ మూమెంట్‌..

**********************************

*Malavika Mohanan: అభిమానుల మనసుల్లో మాళవిక గిలిగింతలు

********************************

*Aishwarya Rai: ఐష్ టాయిలెట్స్ కడగడానికి కూడా ఆ క్రికెటర్ పనికిరాడంటూ.. నెటిజన్లు ఫైర్

*********************************

Updated Date - 2023-11-16T11:36:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!