Chandramukhi 2: దర్శకుడు వాసుకి సంగీత దర్శకుడిగా కీరవాణిని పెట్టుకోవటం ఇష్టం లేదా?
ABN, First Publish Date - 2023-08-28T12:57:27+05:30
సీనియర్ దర్శకుడు పి వాసు 'చంద్రముఖి 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ముఖ్య పాత్రల్లో కనపడుతున్నారు. దీనికి సంగీతం కీరవాణి అందిస్తున్నారు, అయితే దర్శకుడు మొదటి ఛాయస్ మాత్రం కీరవాణి కాదని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. అందుకే ఇష్టం లేకపోయినా కీరవాణితో దర్శకుడు వాసు పని చేశారు అని అంటున్నారు
దర్శకుడు పి వాసు (PVasu), నటుడు రాఘవ లారెన్స్ (RaghavaLawrence) కాంబినేషన్ లో 'చంద్రముఖి 2' #Chandramukhi2 విడుదలకి సిద్ధం అవుతోంది. ఈ సినిమా తమిళ ట్రైలర్ కూడా విడుదలైంది, ఈ సినిమాలో చంద్రముఖి గా హిందీ నటి కంగనా రనౌత్ (KanganaRanaut) నటిస్తోంది. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MMKeeravani) పని చేస్తున్నారు. అయితే కీరవాణి ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా మొదటి ఛాయస్ కాదు అని మాత్రం తమిళ పరిశ్రమలో ఒక మాట వినపడుతోంది.
ఎందుకంటే దర్శకుడు వాసుకి మాత్రం సంగీత దర్శకుడిగా విద్యాసాగర్ (MusicDirectorVidyasagar) ని పెట్టుకోవాలని చాలా గట్టిగా వుంది. ఎందుకంటే విద్యాసాగర్ 'చంద్రముఖి' #Chandramukhi సినిమాకి సంగీతం అందించారు, అందుకని అతనే ఈ సీక్వెల్ కూడా ఉంటే మంచి సంగీతాన్ని ఇవ్వగలడు అన్నది దర్శకుడు పి వాసు మనసులో మాట. మాస్ట్రో ఇళయరాజా ( MaestroIlayaraja) తరువాత అంతటి సంగీత పరిజ్ఞానం వున్న సంగీత దర్శకుడు ఎవరన్నా వున్నారు అంటే అది ఒక్క విద్యాసాగర్ అని వాసు అభిప్రాయం.
అయితే తమిళంలో కొన్ని ప్రైవేట్ చానెల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ల్లో పి వాసు తనకి విద్యాసాగర్ అంటే ఎంత ఇష్టమో చెప్పారు, అలాగే 'చంద్రముఖి' #Chandramukhi అనగానే ముందు సంగీత దర్శకుడు విద్యాసాగర్ పేరు అందరి చెవులకి వినపడుతుంది, ఎందుకంటే ఆ పాటలు అంత జనరంజకంగా ఉన్నాయని చెప్పారు వాసు. అందుకనే అతను విద్యాసాగర్ ని ఈ సీక్వెల్ కి కూడా పెట్టుకోవాలని అనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడయితే లైకా ప్రొడక్షన్ (LycaProductions) వాళ్ళ చేతికి వెళ్లిందో వాళ్ళు కీరవాణిని పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేసినట్టుగా చెప్పుకొచ్చారు వాసు.
ఎందుకంటే కీరవాణికి అప్పటికే ఆస్కార్ అవార్డు (OscarAward) రావటం, 'బాహుబలి' #Baahubali సినిమా, తరువాత 'ఆర్ఆర్ఆర్' #RRR సినిమాలు చెయ్యడం అవి పెద్ద విజయం సాధించటంతో అతని పేరు ఉంటే సినిమాకి హైప్ వస్తుందనే నమ్మకంతో వాళ్ళు కీరవాణి పేరు సజెస్ట్ చేసినట్టుగా చెప్పుకొచ్చారు వాసు. అంటే అతనికి విద్యాసాగర్ ఇష్టం వున్నా, ప్రొడక్షన్ హౌస్ కీరవాణి పేరు చెప్పడంతో ఇంకా ఏమి చెయ్యలేక కీరవాణి ని పెట్టుకున్నట్టుగా తెలిసింది. ఆ ఇంటర్వ్యూ లో వాసు విద్యాసాగర్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. సంగీతం నోట్స్ రాసుకొని సంగీతం అందించేది ఇప్పుడు ఒక్క విద్యాసాగర్ మాత్రమే అన్నట్టుగా చెప్పుకొచ్చారు వాసు. దీనిని బట్టి, దర్శకుడు వాసుకి 'చంద్రముఖి 2' కీరవాణితో పనిచేయటం ఇష్టం లేకపోయినా, ప్రొడక్షన్ హౌస్ కోసం చేశారని అర్థం అవుతుంది.