కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నవల ఆధారంగా.. దర్శన్‌, దర్శన‌లతో సినిమా

ABN, First Publish Date - 2023-12-02T16:39:21+05:30

‘కానా’ ఫేం దర్శన్‌, ‘హృదయం’ ఫేం దర్శన రాజేంద్రన్‌ జంటగా కొత్త చిత్రం తెరకెక్కనుంది. ‘సినిమాక్కారన్‌’ ఫేం వి.వినోద్‌ కుమార్‌ సమర్పణలో ‘సేత్తుమాన్‌’ ఫేం తమిళ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం నుంచి షూటింగ్‌ని ప్రారంభించుకుంది.

‘కానా’ ఫేం దర్శన్‌, ‘హృదయం’ ఫేం దర్శన రాజేంద్రన్‌ జంటగా కొత్త చిత్రం తెరకెక్కనుంది. ‘సినిమాక్కారన్‌’ ఫేం వి.వినోద్‌ కుమార్‌ సమర్పణలో ‘సేత్తుమాన్‌’ ఫేం తమిళ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమలో అనేక నవలలు దృశ్య కావ్యాలుగా తెరకెక్కుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ కోవకు చెందిన చిత్రం ‘ముల్లుం మలరుమ్‌’ కూడా. ఇపుడు అలాంటి ఒక మంచి నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రఖ్యాత నవలా రచయిత పెరుమాళ్‌ మురుగన్‌ ఈ కథను సమకూర్చడమే కాకుండా, మాటలను అందిస్తున్నారు. ‘సేత్తుమాన్‌’ చిత్రంతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న తమిళ్‌.. ఇపుడు మరో అద్భుతమైన కథతో ప్రేక్షకులను అలరించేందుకు ముందుకువస్తున్నారు.

ఇదే విషయంపై తమిళ్‌ మాట్లాడుతూ... మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించడమే కాకుండా.. ఆ చిత్రాల్లో పనిచేసిన నటీనటులను, టెక్నీషియన్లను ప్రోత్సహిస్తారు. పైగా ప్రేక్షకులకు మంచి కథతో కూడిన సినిమాను అందించాలన్న తపన కలిగిన నిర్మాత ఎస్‌.వినోద్‌ కుమార్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ డ్రీం ప్రాజెక్టును రూపొందించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ సినిమా షూటింగ్‌ను శుక్రవారం నుంచి ప్రారంభించాం. నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Pindam Movie: సినిమాకు ‘పిండం’ అని టైటిల్ పెట్టడానికి కారణమిదేనట..

***************************************

*SS Karthikeya: ‘యానిమల్’‌ని చూసిన ఎస్.ఎస్. రాజమౌళి తనయుని రియాక్షన్ ఇదే..

*************************************

*Avika Gor: అలాంటి వారంతా ‘వధువు’ కోసం ఓటీటీకి వస్తారు

****************************************

Updated Date - 2023-12-02T16:43:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!