Mansoor Ali Khan: హీరోయిన్లతో పార్టీలు చేసుకునే.. చిరంజీవిపై మన్సూర్ సంచలన కామెంట్స్
ABN, First Publish Date - 2023-11-28T17:56:04+05:30
బురదలో రాయి వేస్తే ఆ బురద మన మీదే పడుతది అన్న చందంగా తయారెంది.. ఈ అరవ పంచాయితీ. గడిచిన ఇరవై రోజులుగా వార్తల్లో నానుతూ వస్తున్న మన్సూర్ అలీఖాన్, త్రిషల వివాదం రోజుకో మలుపు తిరుగుతూ ఇప్పుడు టాలీవుడ్‌పై పడింది. తాజాగా మన్సూర్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు మరోసారి సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
బురదలో రాయి వేస్తే ఆ బురద మన మీదే పడుతది అన్న చందంగా తయారెంది.. ఈ అరవ పంచాయితీ. గడిచిన ఇరవై రోజులుగా వార్తల్లో నానుతూ వస్తున్న మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan), త్రిష (Trisha Krishnan)ల వివాదం రోజుకో మలుపు తిరుగుతూ ఇప్పుడు టాలీవుడ్‌పై పడింది. తాజాగా మన్సూర్ చిరంజీవి (Chiranjeevi)పై చేసిన వ్యాఖ్యలు మరోసారి సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వివాదంలో ఇప్పటికే త్రిష, ఖుష్భూ,చిరంజీవిలపై పరువు నష్టం దావా వేస్తానంటూ ప్రకటించిన మన్సూర్ ఇప్పుడు మెగాస్టార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
అసలు విషయానికి వస్తే మన్సూర్ (Mansoor Ali Khan), త్రిషల (Trisha Krishnan) మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఇష్యూపై చిరంజీవి సోషల్ మీడియాలో స్పందిస్తూ త్రిషకు మద్దతు ప్రకటిస్తూ మన్సూర్ చర్యను తీవ్రంగా ఖండించారు. వక్ర బుద్ధి గలవారు చేష్టలు అలాగే ఉంటాయని మనం వారిని దూరం పెట్టాలని, మనమూ దూరంగా ఉండాలంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఈ ఇష్యూ మరింతగా వైరల్ అయి టాలీవుడ్ నుంచి మరికొంత మంది నటులు మన్సూర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు ఈ విషయంలోనే మన్సూర్ తీవ్రంగా స్పందించాడు.
నేను మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నానని, చిరంజీవితోనూ సినిమాలు చేశానని ఆయన లాంటి స్టార్ నటుడు అసలు వాస్తవాలేంటో తెలుసుకోకుండా నాపై సామాజిక మాధ్యమాల్లో ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. నాపై కామెంట్స్ చేసేటప్పుడు నన్ను అడిగి అసలు జరిగిందేంటో తెలసుకుని మాట్లాడితే బాగుండేదంటూ ఫైర్ అయ్యారు. మరి నాకు వక్రబుద్ధి అన్న చిరంజీవి గతంలో ఏం చేశాడో తెలసునని, పార్టీ పెట్టి వేల కోట్లు వెనకేసుకుని అస్థులు సంపాదించారని, పేదలకు సాయం చేయలేదని ఈ తర్వాత పార్టీని వీలీనం చేసి ఏం చేశాడో అందరికీ తెలుసునని అన్నారు. ఇప్పుడు ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టాడని డబ్బులు సంపాదిస్తూ ప్రజలకు ఏం చేయడం లేదంటూ తనదైన శైలిలో రెచ్చిపోయాడు.
ఆయన ఇంతటితో ఆగకుండా.. ప్రతి సంవత్సరం చిరంజీవి నాటి కథానాయికలతో మాత్రమే పార్టీలు చేసుకుంటాడని, నన్ను ఎప్పుడు పిలవలేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. అది ఆయన ఇష్టమని, అయినా చిరంజీవి నిజమేంటో తెలసుకోకుండా నాపై వ్యాఖ్యలు చేయడం బాధగా అనిపించిందని అందుకే ఆయనపై రూ.20 కోట్లు, త్రిష, ఖుష్బూలపై చెరో 10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ వచ్చే డబ్బును తమిళనాడులో ఇటీవల మధ్యం తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు పంచుతానని అన్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టేదిలేదన్నారు. ఇప్పుడు మన్సూర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఈ మన్సూర్ వ్యాఖ్యలపై పలువురు ఖండిస్తున్నారు. ఆయన త్రిషతో ఇష్యూను పక్కదోవ పట్టించేందుకు ఇప్పుడు చిరంజీవి (Chiranjeevi) కేంద్రంగా విమర్శులు చేస్తున్నాడని, తన రాజకీయ వృద్ధి కోసం సమస్యను పెంచుతున్నాడంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరేమో చిరంజీవి ఈ ఇష్యూలో అనవసరంగా వేలు పెట్టాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి ఈ వివాదం మున్ముందు ఇంకెన్నీ రూపాలు మార్చుకుంటుందో.