Mansoor Ali Khan: అన్నంత పని చేసిన మన్సూర్.. చిరంజీవి, త్రిష, ఖుష్బులపై కేసు
ABN, First Publish Date - 2023-12-09T11:18:21+05:30
చెప్పినట్టుగానే అన్నంత పని చేశాడు మన్సూర్ అలీఖాన్. చిరంజీవి, త్రిష, ఖుష్బులపై కేసు పెట్టి తన పంతం నెగ్గించుకున్నాడు. దీంతో వారం పదిరోజులుగా నిశబ్దంగా ఉన్న ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చి ట్రెండింగ్ అవుతున్నది. ఇప్పుడు ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
చెప్పినట్టుగానే అన్నంత పని చేశాడు మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan). చిరంజీవి (Chiranjeevi), త్రిష (Trisha), ఖుష్బు (kushboo)లపై కేసు పెట్టి తన పంతం నెగ్గించుకున్నాడు. దీంతో వారం పదిరోజులుగా నిశబ్దంగా ఉన్న ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చి ట్రెండింగ్ అవుతున్నది. ఇప్పుడు ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
గత రెండు నెలలుగా త్రిష(Trisha), మన్సూర్ల మధ్య తీవ్ర వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. లియో సినిమా విజయం అనంతరం ఆ చిత్రంలో లియోకు ప్రధాన స్నేహితుడిగా నటించిన మన్సూర్ ఓ బీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటివరకు చాలా సినిమాలలో బెడ్ సన్నివేశాలలో నటించానని ఈసినిమాలోనూ త్రిషతో అలాంటి సన్నివేశాలు ఉంటాయనుకుంటే నిరాశే ఎదురైంది అంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట బాగా వైరలై గాయి గాయి కావడంతో దేశమంతటా చర్చనీయాంశం అయింది.
ఈక్రమంలోనే టాలీవుడ్ నుంచి చిరంజీవి స్పందిస్తూ త్రిష(Trisha) సపోర్ట్ చేయడం మన్సూర్ అలీఖాన్ చర్యను తప్పుబట్టడంతో సమస్య మరింతగా ట్రెండింగ్ అయి ఖుష్బూ (kushboo)తో పాటు చాలామంది నటులు రెస్పాండ్ అయ్యారు. చైన్నై కోర్టు, జాతీయ మహిళా సంఘం కలుగ జేసుకోని కేసులు నమోదు చేయడంతో మన్సూర్ క్షమాపణలు కూడా చెప్పడం జరిగిపోయాయి.
ఇక ఇంతటితో ఈ ఇష్యూ ముగిసినట్టే అనుకున్న క్రమంలో మన్సూర్ అసలు నేను తప్పు చేయలేదని వాస్తవాలేంటో నేను మాట్లాడిన వీడియో చూస్తే సరిపోయేదని అవేమి చూడకుండా నాపై నిందలు వేశారంటూ చిరంజీవి, ఇతర నటులపై ఫైర్ అయ్యారు. అంతేకాకుండా వారిపై కూసు వేస్తానంటూ ప్రకటించారు. ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తూ శుక్రవారం త్రిష, ఖుష్బూ, చిరంజీవీలపై కేసు వేశారు.