కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mansoor Ali Khan: ఎగిరెగిరి పడ్డాడు.. చివరికి నిండా మునిగాడు.. ఫైన్ ఎంత వేశారంటే?

ABN, Publish Date - Dec 22 , 2023 | 05:19 PM

మొత్తానికి మన్సూర్ అలీఖాన్ కేసు ఓ దశ‌కు వచ్చింది. ఈ రోజు కేసును ప‌రిశీలించిన మ‌ద్రాస్ హైకోర్టు త్రిష, చిరంజీవి , ఖుష్బూల‌పై వేసిన డిఫ‌మెష‌న్ కేసును కొట్టి వేసి మ‌న్సూర్ అలీఖాన్ ఫైన్ చెల్లించాలంటూ తీర్పున‌ను వెలువ‌రించింది.

mansoor ali khan

Mansoor Ali Khan: మొత్తానికి మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan) కేసు ఓ దశ‌కు వచ్చింది. గడిచిన రెండు మూడు నెలలుగా వార్తల్లో ప్రధమంగా నిలుస్తున్న ఆయన వ్యవహారం శుక్రవారం మరో టర్న్ తీసుకుంది. విజ‌య్, త్రిష (Trisha Krishnan) జంట‌గా లోకేశ్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన లియో సినిమా ఆక్టోబ‌ర్‌లో విడుద‌లై ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ క్ర‌మంలో సినిమాలో హీరో స్నేహితుడి క్యారెక్ట‌ర్ కేసిన త‌మిళ న‌టుడు మ‌న్సూర్ అలీఖాన్ ఓ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇస్తూ త్రిష‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం, త్రిష రియాక్ట్ అవ‌డంతో ఇష్యూ పెద్ద‌గా మారి దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే..

ఈ ఘ‌ట‌న విష‌యంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ఖుష్బూ మ‌రికొంత మంది న‌టులు త్రిష (Trisha Krishnan)కు మ‌ద్ద‌తుగా నిలిచి మ‌న్సూర్ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ ఆయ‌న‌పై చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని కోరారు. అదే స‌మ‌యంలో జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌, మ‌ద్రాస్ హైకోర్టులు రంగంలోకి దిగి మ‌న్సూర్ అలీఖాన్‌ (Mansoor Ali Khan)పై కేసులు న‌మోదు చేయించి, చ‌ర్య‌లు కూడా తీసుకోవాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది. దీంతో వెంట‌నే మ‌న్సూర్ త్రిష‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో ఇక ఇంత‌టితో ఇష్యూ ముగిసిపోయింద‌ని భావించారు..


కానీ మ‌ళ్లీ వారం ప‌ది రోజుల త‌ర్వాత మ‌న్సూర్ కోర్టుకు వెళ్లి త్రిష (Trisha Krishnan), చిరంజీవి (Chiranjeevi), ఖుష్బూల‌పై కేసు వేశాడు. నేనెలాంటి నేరం చేయ‌లేద‌ని అస‌లు నేను మ‌ట్టాడిన మాట‌లు , వీడియో పూర్తిగా చూడ‌కుండానే వారు నాపై నింద‌లు వేశార‌ని, నా ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించారని వారితో నాకు న‌ష్ట ప‌రిహారం ఇప్పించాల‌ని కోర్డుకు వెళ్ల‌గా మ‌న్సూర్‌ (Mansoor Ali Khan)పైనే సీరియ‌స్ అవుతూ మీ ప్ర‌వ‌ర్త‌న మార్చుకోవాల‌ని జ‌డ్జి వార్నింగ్ ఇచ్చారు. కొంత‌కాలంగా ఇత‌రుల‌తో మీ న‌డ‌వ‌డిక బాగా లేద‌ని సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ కావ‌డానికి ఇలా చేస్తున్నార‌ని, కేసు వేయాల్సిన బాధితులు సైలెంట్‌గా ఉంటే మీరెందుకు వివాదాన్ని మ‌రింత‌గా పెంచుతున్నార‌ని పేర్కొంటూ కేసును వాయిదా వేసింది.

తాజాగా తిరిగి కేసును ప‌రిశీలించిన మ‌ద్రాస్ హైకోర్టు (Chennai High Court Judgement) త్రిష (Trisha Krishnan), చిరంజీవి (Chiranjeevi), ఖుష్బూల‌పై వేసిన డిఫ‌మెష‌న్ కేసును కొట్టి వేసి మ‌న్సూర్ అలీఖాన్ కోర్టుకు ల‌క్ష రూపాయ‌లు ఫైన్ చెల్లించాలంటూ తీర్పున‌ను వెలువ‌రించింది. అట్టి డ‌బ్బుల‌ను రెండు వారాల్లోగా అడ‌యార్ క్యాన్స‌ర్ ఇనిస్టిట్యూట్‌లో చెల్లించాలని స్ప‌ష్టం చేసింది. దంతో మ‌రోసారి త్రిష‌, మ‌న్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan) వివాదం సోష‌ల్‌మీడియాలో ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది.

Updated Date - Dec 22 , 2023 | 05:30 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!