కార్పొరేట్ గుప్పెట్లో చిత్ర పరిశ్రమ: గేయ రచయిత హాట్ హాట్ కామెంట్స్
ABN, Publish Date - Dec 20 , 2023 | 09:59 AM
ప్రస్తుతం చిత్రపరిశ్రమ కార్పొరేట్ శక్తుల గుప్పెట్లో ఉందని, టీవీల్లో 300కు పైగా ప్రసారమైన చిత్రాలను ఇపుడు రీ రిలీజ్ పేరుతో విడుదల చేయడం ఏమిటని సినీ గేయరచయిత ప్రియన్ ప్రశ్నించారు. తమిళ్ తిరైక్కూడం నిర్మాణంలో ప్రముఖ పాటల రచయిత ప్రియన్ కథను సమకూర్చి దర్శకత్వం వహించిన చిత్రం ‘అరణం’. ఈ చిత్ర ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమంలో తాజాగా చెన్నైలో జరిగింది.
ప్రస్తుతం చిత్రపరిశ్రమ కార్పొరేట్ శక్తుల గుప్పెట్లో ఉందని, టీవీల్లో 300కు పైగా ప్రసారమైన చిత్రాలను ఇపుడు రీ రిలీజ్ పేరుతో విడుదల చేయడం ఏమిటని సినీ గేయరచయిత ప్రియన్ (Lyricist Priyan) ప్రశ్నించారు. తమిళ్ తిరైక్కూడం నిర్మాణంలో ప్రముఖ పాటల రచయిత ప్రియన్ కథను సమకూర్చి దర్శకత్వం వహించిన చిత్రం ‘అరణం’. వైవిధ్యభరితమైన హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందించారు. త్వరలో విడుదల కానుంది. హీరోయిన్‌గా వర్ష (Varsha) నటించారు. లఘుభరణ్, కీర్తనా వంటి పలువురు ప్రముఖ నటీనటులు నటించారు. నితిన్ కే రాజ్, నౌషద్ ఛాయాగ్రహణం అందించగా, షాజన్ మాధవ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ను తాజాగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
ఇందులో దర్శకుడు ప్రియన్ (Priyan) మాట్లాడుతూ.. ఈ చిత్రం తపస్సు వంటిది. మంచి అనుభవం. 20 యేళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న వారినే ముప్పుతిప్పలు పెడుతుంటే కొత్తగా వచ్చినవారి పరిస్థితి ఏమిటి? కళను ఆ రంగంలో ఉంటూనే నాశనం చేయడం ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే జరుగుతోంది. ఈ చిత్ర నిర్మాణం అనేక విషయాలు నేర్చుకునేందుకు దోహదపడింది. చాలామంది హీరోయిన్లు తాము నటించిన చిత్రాల ఆడియో ఫంక్షన్లకు హాజరుకావడం లేదు. కానీ, వర్ష మాత్రం నటించడమే కాకుండా, ఒక అసిస్టెంట్ దర్శకురాలిగా కూడా పనిచేశారు. (Aranam Movie Audio Launch)
సినిమాను నిర్మించడం ఇప్పుడు చాలా కష్టంగా మారింది. సినిమా ఇండస్ట్రీ దర్శక నిర్మాతల చేతుల్లో లేదు. కార్పొరేట్ గుప్పెట్లోకి వెళ్లిపోయింది. మంచి చిత్రాలకు ఇక్కడ చోటు లేదు. ఒక పెద్ద చిత్రం వచ్చిందంటే, ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్న చిన్న చిత్రాన్ని తొలగించేస్తున్నారు. కొత్త చిత్రాలకు అవకాశం కల్పించాలి. ‘అరణం’ (Aranam) ఎంతో బాగా తీశాం. మొదటి భాగం చూసిన తర్వాత కూడా రెండో భాగం కథ ఎలా సాగుతుందో ఊహించుకోలేరు. మా సినిమాను మీడియా ఆదరించాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
====================
*Sara Ali Khan: సారా అలీఖాన్ కోరిక ఏంటో తెలుసా?
**********************************
*We Love Bad Boys: సెన్సార్ పూర్తి చేసుకున్న కడుపుబ్బే కామెడీ ఎంటర్‌టైనర్
*************************************
*Bigg Boss Telugu 7 Winner: ‘BB’నే విన్నర్.. టాప్ 2, 3 స్థానాలకే వారు పరిమితం
*******************************