కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Leo: ‘లియో’ ఫీవర్‌.. 9కి వద్దు.. ఉదయం 4, 7 గంటల ఆట కోసం పట్టు

ABN, First Publish Date - 2023-10-17T16:02:24+05:30

తమిళనాడు రాష్ట్రంలోని సినీ అభిమానులకు ‘లియో’ ఫీవర్‌ పట్టుకుంది. అగ్రహీరో విజయ్‌ నటించిన ఈ చిత్రం ఈనెల 19న విడుదలకానుంది. దీంతో రాష్ట్రంలోని పలు థియేటర్లు తమ అభిమాన హీరో విజయ్‌ డిజిటల్‌ బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్స్‌తో నింపేశారు. మరోవైపు, ఈ చిత్రాన్ని వేకువజామున 4 గంటలకు తొలి ఆటను, అనుమతి ఇచ్చిన 9 గంటల ఆటను 7గంటలకు ప్రదర్శించేలా అనుమతి కోరుతూ నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.

Vijay in Leo Movie

తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని సినీ అభిమానులకు ‘లియో’ (Leo) ఫీవర్‌ పట్టుకుంది. అగ్రహీరో విజయ్‌ (Vijay) నటించిన ఈ చిత్రం ఈనెల 19న విడుదలకానుంది. దీంతో రాష్ట్రంలోని పలు థియేటర్లు తమ అభిమాన హీరో విజయ్‌ డిజిటల్‌ బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్స్‌తో నింపేశారు. మరోవైపు, ఈ చిత్రాన్ని వేకువజామున 4 గంటలకు తొలి ఆటను ప్రదర్శించేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ చిత్ర నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే ప్రభుత్వం అనుమతిచ్చిన 9 గంటల ఆటను ఉదయం 7 గంటలకే ప్రదర్శించేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరింది.

సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఒక షోకు మరో షోకు మధ్య విరామం 45 నిమిషాలు ఉండాలని, విశ్రాంతి (ఇంటర్వెల్‌) సమయం 20 నిమిషాలుగా ఉండాలని గుర్తు చేసింది. సినిమా ప్రదర్శించే సమయంతో పాటు విరామ సమయాలన్నీ కలిపితే మొత్తం 18 గంటలకుపైగా సమయం పడుతుంది. ఉదయం 9 గంటలకు షో మొదలుపెడితే పూర్తయ్యేందుకు మధ్యాహ్నం 1.30 గంటలకు ముగుస్తుంది. ఈ ప్రకారంగా రోజుకు 5 ఆటలను ప్రదర్శించలేమని, అందువల్ల ప్రభుత్వం అనుమతిచ్చిన 9 గంటల షోను ఉదయం 7 గంటలకే ప్రదర్శించేలా అనుమతించాలని నిర్మాణ సంస్థ కోరింది. (Leo Extra Shows)


దీనికి ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది స్పందిస్తూ.. అదనపు షోను ప్రదర్శించడాన్ని క్రమబద్ధీకరించాలని కోరుతూ మదురై బెంచ్‌లో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైందని, దాన్ని కూడా ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలో ధర్మాసనంకు బదిలీ చేసి, ఈ పిటిషన్‌తో కలిపి విచారించాలని కోరారు. దీంతో న్యాయమూర్తి అనిత సుమంత్‌ (Anitha Sumantha) ఈ కేసు విచారణను మంగళవారం తొలికేసుగా విచారిస్తామన్నారు. ఇదిలావుండగా ‘లియో’ (Leo) విడుదలపై అనిశ్చితి నెలకొంది. ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటి వారం కలెక్షన్లలో 75 శాతం తమకు ఇవ్వాలని నిర్మాణ సంస్థ సెవెన్‌ స్ర్కీన్‌ స్టూడియోస్‌ (Seven Screen Studios) కోరుతోంది. ఈ విషయంపై థియేటర్‌ యజమానులతో నిర్మాణ సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.


ఇవి కూడా చదవండి:

============================

*Japan: దీపావళికి థియేటర్లలోకి.. ఈలోపే పోస్టర్స్‌తో పేల్చేస్తున్నారు

*****************************************

*Sona: ఆ చిన్న పొరపాటు వల్లే నన్ను శృంగార తారను చేశారు

***************************************

*Akira Nandan: ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈవెంట్‌లో ఈ పేరే హాట్ టాపిక్..

***********************************

*Mistake: ఓటీటీలో ‘మిస్టేక్’కు మెరుపులాంటి స్పందన..

***********************************

*Extra Ordinary Man: ‘ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్‌’లో యాంగ్రీమ్యాన్.. లుక్ చూశారా?

**********************************

Updated Date - 2023-10-17T16:02:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!