సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kushboo: పెళ్ళి కోసం నేను మతం మారలేదు.. ‘కేరళ స్టోరీ’ విమర్శలపై ధీటైన సమాధానం

ABN, First Publish Date - 2023-05-10T19:46:41+05:30

ది కేరళ స్టోరీ చిత్రం వాస్తవాలను ప్రతిబింబించే విధంగానే ఉందని, నిజాలను నిర్భయంగా చూడటానికి భయపడి కొన్ని వర్గాలు ఆ చిత్ర ప్రదర్శనను వ్యతిరేకిస్తుండటం..

Kushboo on The Kerala Story
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) చిత్రం కారణంగా దేశవ్యాప్తంగా లవ్‌ జీహాద్‌ అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది. కొన్ని స్టేట్స్‌లో ఈ సినిమాపై ఇప్పటికే నిషేధం (Ban) విధించారు. అయితే కొందరు మాత్రం ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రంగా చెబుతూ.. ఇందులో ముస్లింలను అగౌరవ పరిచేలా ఏం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి ఖుష్బూ (Kushboo)పై పలువురు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వారికి ఆమె కూడా ధీటుగానే సమాధానమిస్తున్నారు. లవ్‌ జీహాద్‌ అంశంపై ఆమెను టార్గెట్ చేస్తున్న వారికి ఖుష్బూ స్ట్రాంగ్‌గా రిప్లయ్ ఇచ్చారు.

‘వివాహం కోసం నేను మతం మారినట్టు జోరుగా ప్రచారం చేసేవారు కొంచెం తమ జ్ఞానాన్ని పెంచుకోండి. మన దేశంలోని వివాహ చట్టం గురించి కచ్చితంగా వారికి తెలిసివుండదు. పెళ్ళి కోసం నేను ఏ ఒక్క మతానికి మారలేదు. మతం మారాలని ఎవరూ నాపై ఒత్తిడి చేయలేదు. నా 23 ఏళ్ల వైవాహిక జీవితం గౌరవం, నమ్మకం, సమానత్వం, ప్రేమకు ప్రతీకగా ఉంది’ అని పేర్కొన్నారు. ఖుష్బూ కోలీవుడ్‌ దర్శకుడైన సుందర్‌ సి. (Sunder C) ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. ముస్లిం మతానికి చెందిన ఖుష్బూ ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.

‘ది కేరళ స్టోరీ’ చూడదగ్గ చిత్రమే: (Kushboo about The Kerala Story)

‘ది కేరళ స్టోరీ’ అందరూ చూడాల్సిన చలనచిత్రమేనని తాజాగా నటి ఖుష్బూ ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్‌ పేజీలో ఓ సందేశాన్ని పొందుపరిచారు. ఆ చిత్రం వాస్తవాలను ప్రతిబింబించే విధంగానే ఉందని, నిజాలను నిర్భయంగా చూడటానికి భయపడి కొన్ని వర్గాలు ఆ చిత్ర ప్రదర్శనను వ్యతిరేకిస్తుండటం శోచనీయమని తెలిపారు. ఆ చిత్రాన్ని వ్యతిరేకించాలో... స్వాగతించాలో ప్రజలే నిర్ణయం తీసుకుని ఉండేవారని తెలిపారు. అబద్ధపు కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం (తమిళ నాడు) ఆ చిత్ర ప్రదర్శనపై నిషేధం అమలు చేయడం గర్హనీయమని ఖుష్బూ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*NBK108: బ్రహ్మాజీకి కోపం వచ్చింది.. అందుకే డైరెక్టర్‌కి నమస్తే పెట్టేశాడు

*Aadi Saikumar: ఆది సినిమా.. ఒకటి కాదు.. రెండు ఓటీటీల్లో..

*Vijayashanthi: ఆ హక్కు ఎవరికుంది?.. ‘ది కేరళ స్టోరీ’ బ్యాన్‌పై సంచలన వ్యాఖ్యలు

*Vasuki Anand: పవన్ కల్యాణ్ సోదరి అందుకే రీ ఎంట్రీ ఇస్తున్నానంటోంది

*VD12: విజయ్ బర్త్‌డే స్పెషల్‌గా ప్రత్యేక పోస్టర్.. ఫ్యాన్స్ ఖుష్

*Kushi: సినిమా పేర్లతో విజయ్ దేవరకొండ, సమంత పాటేసుకున్నారు.. పాట ఎలా ఉందంటే..

Updated Date - 2023-05-10T19:46:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!