సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Jason Sanjay: మెగాపోన్ పట్టనున్న స్టార్ హీరో కుమారుడు

ABN, First Publish Date - 2023-01-09T17:57:44+05:30

కొన్ని రోజుల క్రితమే షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మెగాఫోన్ పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదే బాటలో కోలీవుడ్ స్టార్ హీరో కుమారుడు పయనించబోతున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం అందుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెలబ్రిటీల వారసులందరూ తమ తల్లిదండ్రుల బాటలోనే పయనిస్తుంటారు. సినిమా ఇండస్ట్రీ అందుకు మినహాయింపు ఏమీ కాదు. స్టార్ కిడ్స్ అందరూ సినిమా రంగంలోనే స్థిరపడుతుంటారు. కొన్ని రోజుల క్రితమే షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మెగాఫోన్ పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదే బాటలో కోలీవుడ్ స్టార్ హీరో కుమారుడు పయనించబోతున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం అందుతుంది.

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఇళయ దలపతి విజయ్ (Vijay). అతడి కుమారుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) విదేశాల్లో చదువుకుంటున్నాడు. తండ్రి బాటలోనే నడుస్తూ అతడు హీరోగా మారతాడని అందరు అనుకున్నారు. కానీ, సంజయ్‌కు మాత్రం నటించడం ఇష్టం లేదట. గతంలో ఓ మలయాళీ డైరెక్టర్ నటించమని అడగగా అందుకే జేసన్ నిరాకరించాడట. విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన మనవడికి డైరెక్షన్ అంటే ఇష్టమని చెప్పాడు. ‘‘విజయ్ కుమారుడు సంజయ్‌కు దర్శకత్వంపై మక్కువ ఎక్కువ. అతడు డైరెక్టర్‌గా మారితే విజయ్ సేతుపతితో సినిమా చేస్తాడట. అనంతరం తన తండ్రితో చిత్రాన్ని తెరకెక్కిస్తాడట. ఈ విషయాన్ని గతంలో ఒకసారి నాతో చెప్పాడు’’ అని విజయ్ తండ్రి చంద్రశేఖర్ తెలిపాడు. ఇక విజయ్ కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా ‘వారిసు’ (Varisu) లో నటించాడు. ఈ చిత్రం తెలుగులో ‘వారసుడు’ (Vaarasudu) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందింది. సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదల కానుంది.

Updated Date - 2023-01-10T00:29:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!