A.R. Murugadoss: ‘1947 ఆగస్టు 16’న ఆ ఊర్లో ఏం జరిగింది?
ABN, First Publish Date - 2023-03-17T14:31:53+05:30
మహాత్మా గాంధీ వంటి ఎంతోమంది యోధుల పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.
మహాత్మా గాంధీ వంటి ఎంతోమంది యోధుల పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అయితే.. ఆ రోజుకు ముందు, తర్వాతి రోజుల్లో ఒక కొండ ప్రాంతంలోని గ్రామంలో ఏం జరిగిందన్న అంశాన్ని తీసుకుని, ఒక కల్పిత కథాంశంతో తెరకెక్కించిన చిత్రం ‘1947 ఆగస్టు 16’ (1947 August 16). ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలకానుంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ (A.R. Murugadoss) సమర్పణలో ఏఆర్ మురుగదాస్ ప్రొడక్షన్స్, పర్పుల్‌బుల్ ఎంటర్‌టైన్మెంట్, గాడ్‌బ్లెస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నిర్మితమైంది. ఏఆర్ మురుగదాస్ శిష్యుడు ఎన్.ఎస్.పొన్‌కుమార్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గౌతం కార్తీక్, రేవతి, పొన్‌కుమార్ తదితరులు నటించగా.. శ్యాన్ రోల్డన్ సంగీతం. ప్రమోషన్‌లో భాగంగా చిత్ర నిర్మాతలు మురుగదాస్, ఓం ప్రకాష్ భట్, హీరో గౌతం కార్తీక్, దర్శకుడు ఎన్.ఎ్‌స.పుగళ్, హాస్య నటుడు పుగళ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. (1947 August 16)
పొన్ కుమార్ మాట్లాడుతూ.. ‘స్వాతంత్య్రం వచ్చిందనే విషయమే తెలియని ఒక గ్రామం, అక్కడ నివశించే ప్రజల్లో ఎలాంటి భయాందోళనలు ఉండేవి? ఆ గ్రామస్తులను బ్రిటీషర్లు ఏ విధంగా వేధించారు? భయపెట్టారు? ప్రేమే జీవితంగా భావించే ఒక యువకుడు.. గ్రామ ప్రజల కోసం ఏ విధంగా పోరాటం చేశారు? వంటి అంశాలను కల్పిత కథాంశాలతో తెరకెక్కించాం. పుగళ్‌ను ఇప్పటివరకు ఒక హాస్య నటుడుగానే ప్రేక్షకులు చూశారు. ఇందులో అతనిలోని మరో కోణాన్ని చూస్తారు. స్ర్కిప్టు తయారీలో దర్శకుడు మురుగదాస్ ఎంతగానో సాయం చేశారు. ఆయన వల్లే ఈ ప్రాజెక్టు ఇలా వచ్చింది. 1947 నాటి పరిస్థితులు ప్రతిబింబించేలా చిత్రీకరించాం. శ్యాన్ రోల్డన్ సంగీతం సినిమాకు ప్రాణం’ అని వివరించారు.
హీరో గౌతం కార్తీక్ మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన చిత్రం. ఈ తరహా పాత్ర కోసం ఇతరులను ఆదర్శంగా తీసుకోలేదు. దర్శకుడు చెప్పినట్టుగా నటించాను’ అని అన్నారు. నిర్మాత ఏఆర్.మురుగదాస్ మాట్లాడుతూ.. ‘ఒక మంచి కథతో సినిమా తీసినందుకు సంతోషంగా ఉంది. ఈ కథ అనేక కంపెనీలకి నచ్చినప్పటికీ వివిధ కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో కథను చదవగా నాకు నచ్చడంతో సెట్స్‌పైకి తీసుకెళ్లాం’ అని వివరించారు. ఈ చిత్రం ఏప్రిల్ 7న తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకానుంది.
ఇవి కూడా చదవండి:
Rana: ఎన్టీఆర్ నుంచి అది దొంగతనం చేయాలి.. అనుకుంటే 20 నిమిషాల్లోనే..
Kabzaa Twitter Review: కన్నడ నుంచి మరో ‘కేజీఎఫ్’?.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’
#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్
OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ