సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Nayanthara: తన పిల్లల పూర్తి పేర్లు చెప్పేసిన నయన్.. ఇవేం పేర్లంటూ..

ABN, First Publish Date - 2023-04-03T14:12:53+05:30

సౌతిండియా టాప్ హీరోయిన్ ఎవరని అడిగితే.. ప్రతి ఒక్కరూ నయన తార (Nayanthara ) పేరు చెబుతారనడంలో ఎటువంటి సందేహం లేదు.

Nayanathara
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌతిండియా టాప్ హీరోయిన్ ఎవరని అడిగితే.. ప్రతి ఒక్కరూ నయన తార (Nayanthara ) పేరు చెబుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. మొదట రజనీకాంత్ ‘చంద్రముఖి’ సినీ పరిశ్రమకి పరిచయమై.. అనంతరం వెంకటేశ్ ‘లక్ష్మి’తో టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే.. ఈ బ్యూటీ గతేడాది జూన్‌లో ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ (Vignesh Shivan)ని గ్రాండ్‌గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం సంవత్సరం తిరక్కుండానే సరోగసీ ద్వారా ఈ జంటకి కవల పిల్లలు పుట్టారు. అప్పటి నుంచి ఏదో ఓ రకంగా ఆ పిల్లలకి సంబంధించిన వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా మరోసారి నయన్ పిల్లలకి సంబంధించిన ఓ క్రేజీ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

నయన్, విఘ్నేష్ జంటకి పిల్లలు పుట్టినప్పటి నుంచి వారి పేర్లపై చర్చ జరుగుతోంది. ఆ సమయంలో తన పిల్లల పేర్లు ఇవేనంటూ.. విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో పోస్టుని షేర్ చేశాడు. అందులో వారి పేర్లు కేవలం ఉయిర్ (Uyir), ఉలగ్ (Ulag) అనే పేరు పెట్టామని తెలిపాడు. అయితే.. పూర్తి పేర్లు ఏంటనేది మాత్రం చెప్పలేదు. తాజాగా వారి పూర్తి పేర్లను నయనతార స్వయంగా వెల్లడించింది. (Nayanthara reveals names of twin boys)

చెన్నైలో తాజాగా జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్‌కి నయనతార, విఘ్నేష్ జంట హాజరయ్యింది. ఈ వేడుకలో నయనతార స్టేజ్‌పై ఉండగా.. తన పిల్లల పూర్తి పేర్లు ఏంటని హోస్ట్ అడిగాడు. దానికి సమాధానం చెబుతూ వారి పూర్తి పేర్లని ఆ వేడుకలో నయన్ రివీల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అందులో నయన మాట్లాడుతూ.. ‘నా మొదటి కుమారుడు పేరు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ (Uyir Rudronil N Shivan), నా రెండో కుమారుడి పేరే ఉలగ్ ధైవేగ్ ఎన్ శివన్ (Ulag Dhaivag N Shivan)’ అని చెప్పుకొచ్చింది. ఆ పేర్లలో విఘ్నేష్‌తో పాటు తన పేరు వచ్చేలా పెట్టారు. దీంతో ఇద్దరి పేర్లు బావున్నాయని, అందులోనూ ఆ జంట తమ మార్క్ చూపించిందని కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ’రుద్రోనిల్, ధైవేగ్ అంటే అర్థం ఏంటి’.. ‘ఇవేం పేర్లు’ అంటూ కొందరూ విమర్శలు సైతం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Kangana Ranaut: తనని ట్రోల్ చేయమంటున్న కంగనా.. దేనికోసమంటే..

Janhvi Kapoor: తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జూనియర్ శ్రీదేవి.. తర్వాత అడుగు అటువైపేనా?

Varun Dhawan: స్టేజీపై మోడల్‌కు ముద్దు పెట్టినందుకు ట్రోలింగ్.. వెటకారంగా రిప్లై ఇచ్చిన యంగ్ హీరో

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

IPS Sajjanar: దయచేసి అలా చేయకండి.. అమితాబ్‌కి టీఎస్‌ఆర్టీసీ ఎండీ రిక్వెస్ట్

Updated Date - 2023-04-03T14:14:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!