Keerthi Pandian: చెన్నై వరద ముప్పునకు కారణమిదే?
ABN, First Publish Date - 2023-12-09T17:54:00+05:30
2015లో సంభవించిన వర్దా తుపాను కంటే ఇపుడు వచ్చిన మిచౌంగ్ తుపాను కలిగిన నష్టం అపారమని హీరోయిన్ కీర్తి పాండ్యన్ అన్నారు. దీనికి కారణంగా వివిధ మరమ్మతుల పేరుతో రోడ్లను ఇష్టానుసారంగా తవ్వేయడమేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నై నగరంలోని ప్రధాన రహదారులను కూడా తవ్వి వదిలేస్తున్నారని గుర్తుచేశారు.
2015లో సంభవించిన వర్దా తుపాను కంటే ఇపుడు వచ్చిన మిచౌంగ్ తుపాను కలిగిన నష్టం అపారమని హీరోయిన్ కీర్తి పాండ్యన్ (Keerthi Pandian) అన్నారు. దీనికి కారణంగా వివిధ మరమ్మతుల పేరుతో రోడ్లను ఇష్టానుసారంగా తవ్వేయడమేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నై నగరంలోని ప్రధాన రహదారులను కూడా తవ్వి వదిలేస్తున్నారని గుర్తుచేశారు. మిచౌంగ్ తుఫాను (Cyclone Michaung) కారణంగా సంభవించిన వరద ముంపులో ఆమె చిక్కుకున్నారు. (Chennai Rains)
ఇటీవలే హీరో అశోక్ సెల్వన్(Ashok Selvan)ను వివాహం చేసుకున్న ఈ నవ దంపతులు స్థానిక మైలాపూరులోని డాక్టర్ రాధాకృష్ణన్ రోడ్డులోని ఒక ఇంటిలో ఉంటున్నారు. ఆమె ఉండే ఇంటి చుట్టూత నీరు చేరింది. ఈ దంపతులను సహాయక బృందాలు రెండు రోజుల తర్వాత రక్షించాయి. తాము పడిన కష్టాలపై ఆమె ఓ ట్వీట్ చేశారు. అందులో..
‘‘ఈప్రాంతంలో ఎపుడు కూడా చుక్కనీరు ఉండదు. ముఖ్యంగా గత 2015లో సంభవించిన భారీ వరదల సమయంలోనూ నీరు నిలవలేదు. కానీ, ఈ మధ్య చిన్నపాటి వర్షానికే ఈ రహదారిలో నీళ్ళు నిలుస్తున్నాయి. దీనికి కారణం.. రోడ్లను ఇష్టానుసారంగా తవ్వి, ఆ గుంతలను పూడ్చకపోవడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. వర్షపునీరు సాఫీగా వెళ్ళేందుకు దారిలేక రోడ్లపై నిలిచిపోతుంది. రెండు రోజుల తర్వాత సహాయక బృందాలు మమ్మల్ని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి’’ అని పేర్కొన్నారు. అదేవిధంగా హీరోయిన్ అదితి బాలన్ కూడా సహాయక చర్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడుంది? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. (Chennai Rains 2023)
ఇవి కూడా చదవండి:
====================
*Director Sai Kiran Daida: స్క్రీన్‌కి అతుక్కొని మరీ ‘పిండం’ సినిమా చూస్తారు..
********************************
*Thandel: నాగ్ స్విచ్.. వెంకీ క్లాప్.. అరవింద్ స్క్రిఫ్ట్
***********************************