Anandhi: ‘కయల్’ ఆనంది డబుల్ ధమకా
ABN, First Publish Date - 2023-05-12T21:46:21+05:30
కరోనా కారణంగా రెండేళ్ళపాటు గ్యాప్ వచ్చినప్పటికీ... ఇపుడామె వరుస చిత్రాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆనంది నటించిన రెండు చిత్రాలు ఈ శుక్రవారం విడుదలయ్యాయి. అవేంటంటే..
ప్రభు సాల్మన్ దర్శకత్వంలో వచ్చిన ‘కయల్’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన తెలంగాణ అమ్మాయి ఆనంది (Anandhi). ఆ సినిమా తర్వాత తమిళ చిత్రపరిశ్రమ (Kollywood)లో ఆమె పేరు ‘కయల్’ (Kayal) ఆనందిగా స్థిరపడిపోయింది. తన తొలిచిత్రం తర్వాత ఆమె నటించిన అనేక తమిళ చిత్రాల్లో అచ్చమైన తమిళమ్మాయి పాత్రల్లో నటించడంతో తమ ఇంటి ఆడపడుచుగా తమిళ ప్రేక్షకులు ఆమెను ఆదరిస్తున్నారు. ముఖ్యంగా ‘కమలి ఫ్రమ్ నడుకావేరి’ చిత్రంలో ఆమె నటనకు యూత్ ఫిదా అయింది. కరోనా కారణంగా రెండేళ్ళపాటు గ్యాప్ వచ్చినప్పటికీ... ఇపుడామె వరుస చిత్రాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమె నటించిన రెండు చిత్రాలు శుక్రవారం విడుదలయ్యాయి.
వీటిలో ఒకటి హీరోయిన్ పాత్ర కాగా, మరొకటి గెస్ట్ రోల్‌లో నటించింది. అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) - కృతిశెట్టి (Krithi Shetty) జంటగా కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) తెరకెక్కించిన ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ (Custody)లో ఆనంది ఓ చిన్న పాత్ర పోషించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఇంతకాలం గోప్యంగా ఉంచగా, తాజాగా విడుదలైన ట్రైలర్‌తో పాటు.. సినిమా చూసిన వారు కూడా ఆ పాత్రని చూసి ఆశ్చర్యపోయారు. అదే విధంగా విక్రమ్ సుగుమారన్ (Vikram Sugumaran) దర్శకత్వంలో శాంతను భాగ్యరాజ్ హీరోగా నటించిన ‘రావణ కోట్టం’ (Raavana Kotam)లో కయల్ ఆనంది హీరోయిన్‌గా నటించగా.. ఈ రెండు చిత్రాలు శుక్రవారమే విడుదలయ్యాయి. దీంతో కోలీవుడ్‌లో ఆమె పేరుతో డబుల్ ధమాకా అంటూ.. అభిమానులు ఆనంది పేరును వైరల్ చేస్తున్నారు.
టాలీవుడ్‌లో ‘ఈరోజుల్లో’ (Ee Rojullo) అనే చిత్రంతో సినీ ఎంట్రీ ఇచ్చిన ఆనంది.. మొదటి నుంచి మంచి పాత్రలనే ఎన్నుకుంటూ నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే టాలీవుడ్‌లో కంటే కూడా.. కోలీవుడ్ (Kollywood)లో ఆమెకు మంచి పేరు రావడం విశేషం. టాలీవుడ్‌లో చివరిగా ఆమె ‘ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం’ అనే సినిమాలో నటించింది. ‘కస్టడీ’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కడంతో.. మరోసారి తమిళ ప్రేక్షకులనే కాకుండా.. తెలుగు ప్రేక్షకులను సైతం ఈ తెలుగమ్మాయ్ ఆశ్చర్యపరిచింది.
ఇవి చదవండి:
************************************************
*Liger: ఆగని వివాదం.. ధర్నాకు దిగిన బాధితులు.. ఛార్మీ సమాధానమిదే!
*Shaakuntalam: చెప్పిన టైమ్ కంటే ఒక రోజు ముందే.. ఓటీటీలోకి వచ్చేసింది
*Naresh: ట్రైలర్.. జస్ట్ మచ్చు తునక మాత్రమే! నా బయోపిక్ కాదు
*Harish Shankar: అప్పుడు 10 ఏళ్ల ఆకలి.. ఇప్పుడు ఇది నా 11 ఏళ్ల ఆకలి
*Ustaad Bhagat Singh: ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది
*Poonam Kaur: ‘ఉస్తాద్’ని కెలికిన పూనమ్ కౌర్.. ఉగ్రరూపం ప్రదర్శిస్తోన్న ఫ్యాన్స్
*Allu Arjun: 30 ఏళ్ల తర్వాత సడెన్‌గా ఆమెని చూసి షాకైన బన్నీ.. ఆమె ఎవరో తెలుసా?