Karthi: కార్తీ సినీ జర్నీలో కోలీవుడ్ అండ..
ABN, First Publish Date - 2023-10-31T15:53:28+05:30
తన తమ్ముడు, హీరో కార్తీ సినీ జర్నీకి తమిళ ప్రపంచం మొత్తం అండగా నిలిచిందని హీరో సూర్య అన్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకా్‌షబాబు, ఎస్‌ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘జపాన్’. రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళికి సందడి చేయనుంది. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ను తాజాగా చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ స్థాయిలో విడుదల చేశారు.
తన తమ్ముడు, హీరో కార్తీ (Karthi) సినీ జర్నీకి తమిళ ప్రపంచం మొత్తం అండగా నిలిచిందని హీరో సూర్య (Suriya) అన్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకా్‌షబాబు, ఎస్‌ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘జపాన్’ (Japan). రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళికి సందడి చేయనుంది. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ను తాజాగా చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ స్థాయిలో విడుదల చేశారు. హీరోలు సూర్య, ఆర్య, విశాల్, జయం రవితో పాటు దర్శకులు రాజు మురుగన్, పా.రంజిత్, లోకేష్ కనకరాజ్, పీఎస్.మిత్రన్, ముత్తయ్య, చిరుత్తై శివ, సుశీంద్రన్, స్టంట్ మాస్టర్లు దిలీప్ సుబ్బరాయన్, పాండ్యన్, శక్తి ఫిల్మ్ ఫ్యాక్టరీ అధినేత శక్తివేలన్, సినీ నటి తమన్నా, ప్రిన్స్ పిక్చర్స్ అధినేత ఎస్.లక్ష్మణన్, నిర్మాత జ్ఞానవేల్ రాజా, నటుడు వాగై చంద్రశేఖర్, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్, నటులు జిత్తన్ రమేష్, బవా చెల్లదురై తదితరులు పాల్గొని ప్రసంగించారు. (Japan Trailer Launched)
ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ.. అందరికీ అవకాశాలు అంత సులభంగా రావని సూపర్‌స్టార్ రజనీకాంత్ చెబుతుంటారు. అలాగే, తనకు వచ్చిన అవకాశాన్ని కార్తీ సద్వినియోగం చేసుకుని ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. హీరో కార్తీ మాట్లాడుతూ... ‘నా సినీ ప్రయాణంలో వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని చెప్పారు. కాగా, ‘జపాన్’ చిత్రం హీరో కార్తీ నటించిన 25వ చిత్రం. దీంతో ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలను కూడా ఇదే వేదికపై నిర్వహించారు. (Karthi 25 Years Cine Journey Celebrations)
ఇవి కూడా చదవండి:
========================
*Producer: తమన్నాతో పోల్చితే ఈ యంగ్ హీరోయిన్లు ఎంతో మేలు..
*******************************
*Razakar: సినిమా బ్యాన్‌పై సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన ‘రజాకార్’ నిర్మాత
********************************
*Hard-Hitting Love Story: కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి.. ‘బేబీ’ మేకర్స్ తగ్గేదే లే..
*******************************