సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vijay Antony: నా ప్రాణాలను నా హీరోయిన్‌ కాపాడింది

ABN, First Publish Date - 2023-05-04T13:25:33+05:30

సాధారణంగా ఫైట్‌ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నటీనటులు గాయపడుతుంటారు. కానీ, నేను హీరోయిన్‌తో రొమాన్స్‌ చేసే..

Actor Vijay Antony
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినిమా షూటింగ్‌ సందర్భంగా సముద్రంలో పడిపోయిన తనను హీరోయిన్‌ కావ్య థాపర్‌ (Kavya Thapar), కెమెరామెన్‌ అసిస్టెంట్స్‌ రక్షించారని హీరో విజయ్‌ ఆంటోని (Vijay Antony) చెప్పారు. భవిష్యత్‌లో విజయ్‌ (Vijay), అజిత్‌ (Ajith) వంటి స్టార్‌ హీరోలను డైరెక్ట్‌ చేయాలని ఉందని ఆయన తెలిపారు. విజయ్‌ ఆంటోని - కావ్య థాపర్‌ జంటగా నటించిన చిత్రం ‘పిచ్చైకారన్‌-2’ (Pichaikkaran 2). ఈ నెల 19న విడుదలకు సిద్ధమైంది. రాధారవి, వైజీ మహేంద్రన్‌, మన్సూర్‌ అలీఖాన్‌, హరీశ్‌ పెరాడి, జాన్‌ విజయ్‌, దేవ్‌ గిల్‌, యోగిబాబు తదితరులు నటించారు. విజయ్‌ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానరుపై నిర్మాత ఫాతిమా విజయ్‌ ఆంటోని నిర్మించారు. ఈ మూవీ ట్రైలర్‌ను గత నెలలో విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర బృందం తాజాగా చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమంలో హీరో విజయ్‌ ఆంటోని (Vijay Antony) మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా ఫైట్‌ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నటీనటులు గాయపడుతుంటారు. కానీ, నేను హీరోయిన్‌తో రొమాన్స్‌ చేసే సన్నివేశ చిత్రీకరణ సమయంలో గాయపడ్డాను. ఈ ప్రమాదం (Accident) జరిగిన తర్వాత సముద్రంలో పడిపోయిన నన్ను హీరోయిన్‌, కెమెరామెన్‌ అసిస్టెంట్స్‌ రక్షించారు. ఈ చిత్రం ‘పిచ్చైకారన్‌’ (Pichaikkaran) కథకు సీక్వెల్‌ కాదు. ఇది వేరే స్టోరీ. ఎమోషన్స్‌ పుష్కలంగా ఉంటాయి. క్లైమాక్స్‌ సన్నివేశంలో కచ్చితంగా ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటారు. ఈ చిత్రానికి యాదృచ్ఛికంగా దర్శకత్వం వహించాను.

ప్రమాదం తర్వాత ఎంతో యాక్టివ్‌గా ఉన్నాను. ముఖంపై చిన్న మచ్చలు మినహా ఆరోగ్యపరంగా బాగున్నాను. నా చిత్రాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి కారణం ఉంది. నా కెరీర్‌ ఆరంభంలో అవకాశాల కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. అలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని ప్రతిభావంతులైన కొత్తవారికి అవకాశం ఇస్తున్నాను. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ కావ్య థాపర్‌, చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలయ్యే ఈ చిత్రానికి సంగీతం కూడా విజయ్‌ ఆంటోనీనే అందించారు (Vijay Antony about Pichaikkaran).

ఇవి కూడా చదవండి:

************************************************

*Dimple Hayathi: గుడి కట్టాలనుకుంటున్న అభిమానికి షాకిచ్చిన హయాతి

*Chaitu Vs Sam: చైతూ ఏమో బాధలేదంటాడు.. సమంత ఏమో టార్చర్ టైమ్ అంటోంది.. ఏంటి కథ?

*Hero Shanthanu Bhagyaraj: ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..

*VD12: విజయ్ దేవరకొండ 12వ చిత్రం ప్రారంభం.. చిత్ర విశేషాలివే!

*Parineeti Chopra: ఆప్ ఎంపీతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం.. ఎప్పుడంటే?

Updated Date - 2023-05-04T13:25:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!