సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Hero Shanthanu Bhagyaraj: ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..

ABN, First Publish Date - 2023-05-03T15:21:52+05:30

జీవితంలో కొత్త పాఠాలు, అనుభవాలను నేర్పిందని, డబ్బులు చూశాక మనుషులు ఏ విధంగా మారిపోతారో ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో తాను ప్రత్యక్షంగా చూశానని..

Shanthanu Bhagyaraj at Raavana Kottam PM
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘రావణ కూట్టం’ చిత్ర షూటింగ్‌.. జీవితంలో కొత్త పాఠాలు, అనుభవాలను నేర్పిందని, డబ్బులు చూశాక మనుషులు ఏ విధంగా మారిపోతారో ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో తాను ప్రత్యక్షంగా చూశానని, షూటింగ్‌ సమయంలో ఎదురైన కష్టాలను, ఒత్తిడిని తట్టుకోలేక ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించానని సినీ హీరో శాంతను భాగ్యరాజ్‌ (Hero Shanthanu Bhagyaraj) వెల్లడించారు. శాంతను భాగ్యరాజ్‌, ‘కయల్‌’ ఆనంది (Anandhi) జంటగా నటించిన చిత్రం ‘రావణ కూట్టం’ (Raavana Kottam). విక్రమ్‌ సుగుమారన్‌ (Vikram Sugumaran) దర్శకుడు. దుబాయ్‌కు చెందిన కన్నన్‌ గ్రూపు అధినేత కన్నన్ రవి (Kannan Ravi) ఈ చిత్రాన్ని నిర్మించారు. జస్టిన్‌ ప్రభాకరన్ (Justin Prabhakaran) సంగీతం. ఈ చిత్రం బృందం తాజాగా చెన్నైలో మీడియాకు చిత్ర విశేషాలను తెలిపేందుకు సమావేశమైంది.

ఇందులో హీరో శాంతను (Hero Shanthanu Bhagyaraj) మాట్లాడుతూ.. ‘‘నిర్మాత కన్నన్‌ ఒక తండ్రి స్థానంలో ఉంటూ నా సినీ కెరీర్‌ ఎదుగుదల కోసం, ఒక మంచి బ్రేక్‌ ఇచ్చేందుకు ఈ చిత్రాన్ని ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా నిర్మించారు. నేను నటించిన ‘చక్కరకట్టి’ చిత్రం తర్వాత ప్రేక్షకుల్లో అధిక అంచనాలు నెలకొన్న మూవీ ఇది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్క నటీనటులు, టెక్నీషియన్‌ రేయింబవుళ్ళు పనిచేశారు. నాలుగేళ్ళలో అనేక విషయాలు నేర్చుకున్నా. ఇందులో గ్రామీణ యువకుడిగా నటించా. దక్షిణాది జిల్లాలోని రాజకీయాల గురించి చూపించాం’’ అని తెలిపారు.

దర్శకుడు విక్రమ్‌ సుగుమారన్‌ (Director Vikram Sugumaran) మాట్లాడుతూ... ‘‘దర్శకుడిగా చాలా మొండి ఘటాన్ని. సెట్స్‌లోకి వెళితే నేను అనుకున్న నటనను రాబట్టుకునేందుకు ఏ ఒక్కరిపట్లా కనికరం చూపను. అది ఒక దర్శకుడిగా నా కర్తవ్యం కూడా. మనల్ని నమ్మి అప్పగించిన బాధ్యలను పూర్తి చేయడం దర్శకుడిగా నా పని. అందుకే షూటింగ్‌ సమయంలో ఎవరిపైనా కనికరం చూపలేదు. చాలా మందిని కష్టపెట్టా.. బాధ పెట్టా. అలాంటి వారందరికీ క్షమాపణలు చెబుతున్నా. శాంతను ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాడు. కచ్చితంగా మంచి బ్రేక్‌ ఇస్తుంది. రామనాథపురం జిల్లాలో షూటింగ్‌ పూర్తి చేశాం’’ అని తెలిపారు. అలాగే హీరోయిన్‌ ఆనంది, సంగీత దర్శకుడు జస్టిన్‌ ప్రభాకరన్, నటుడు ఇళవరసు, నటి దీప, ఆర్ట్‌ డైరెక్టర్‌ నర్మద, నటుడు సంజయ్‌, ఎడిటర్‌ లారెన్స్‌ కిషోర్‌ తదితరులు ప్రసంగించారు. (Raavana Kottam Press Meet)

ఇవి కూడా చదవండి:

************************************************

*VD12: విజయ్ దేవరకొండ 12వ చిత్రం ప్రారంభం.. చిత్ర విశేషాలివే!

*Parineeti Chopra: ఆప్ ఎంపీతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం.. ఎప్పుడంటే?

*Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం

*Actress Shalini: నా విడాకులు వారికి అంకితం.. డివోర్స్ ఫొటోషూట్‌తో నటి హల్చల్

*Vimanam: మరో ‘బలగం’ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనబడుతున్నాయ్..

*I am Salman: సల్మాన్ ఖాన్ ఇలా మారిపోయాడేంటి? గ్రూట్ ఎంత పని చేశావ్..

Updated Date - 2023-05-03T15:21:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!