విలన్‌గా నటించాలనే కోరిక నెరవేరింది: యంగ్ హీరో
ABN, First Publish Date - 2023-11-28T16:46:27+05:30
నెగెటివ్ షేడ్స్ ఉన్న కథానాయకుడి పాత్ర లభించడం తన అదృష్టమని, విలన్‌గా నటించాలనే తన కోరిక ‘పార్కింగ్’ ద్వారా నెరవేరిందని నటుడు హరీష్ కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఫ్యాషన్ స్టూడియోస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ‘పార్కింగ్’ చిత్రం త్వరలో విడుదలకానున్న నేపధ్యంలో హరీష్ కల్యాణ్ మీడియాకు చిత్ర విశేషాలను చెప్పుకొచ్చారు.
నెగెటివ్ షేడ్స్ ఉన్న కథానాయకుడి పాత్ర లభించడం తన అదృష్టమని, విలన్‌గా నటించాలనే తన కోరిక ‘పార్కింగ్’ ద్వారా నెరవేరిందని నటుడు హరీష్ కల్యాణ్ (Harish Kalyan) ఆనందం వ్యక్తం చేశారు. రామ్‌కుమార్ బాలకృష్ణన్ (Ramkumar Balakrishnan) దర్శకత్వంలో హరీష్ కల్యాణ్, ఇందుజ, ఎంఎస్ భాస్కర్, రామరాజేంద్ర, ప్రార్థనానాథన్, ఇళవరసు సహా పలువురు నటించిన ‘పార్కింగ్’ (Parking) చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు చిత్రయూనిట్ తాజాగా పాత్రికేయుల సమావేశం నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో హీరో హరీష్ కల్యాణ్ (Hero Harish Kalyan) మాట్లాడుతూ... ఒక వ్యక్తి ఎంత మంచిగా ఉన్నా, అతనిలో విలనిజం తప్పక ఉంటుంది. విలనిజంతో కూడిన హీరో పాత్ర లభించడం అదృష్టంగా భావిస్తున్నా. ‘అపూర్వ రాగంగళ్’లో రజనీ (Rajinikanth) సార్, కమల్ (Kamal Haasan) సార్ పలు చిత్రాలు, విజయ్ (Vijay) సార్ నటించిన ‘ప్రియముడన్’, అజిత్ (Ajith) సార్ ‘వాలి’ తదితర చిత్రాలకు ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించారు. ప్రతి ఒక్కరిలో ఈగో, విలనిజం ఉంటుందని.. అది ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో బయటపడుతుంది అనేదే ముఖ్యం. అలాంటి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ చిత్రం తప్పక ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకముందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Shashtipoorthi: ‘లేడీస్ టైలర్’ జంట ‘షష్టిపూర్తి’ ఎంత వరకు వచ్చిందంటే..
***********************************
*Rashmika Mandanna: గర్ల్ ఫ్రెండ్‌గా రష్మిక మందన్నా.. క్లాప్ కొట్టేశారు
**********************************