కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gautham Vasudev Menon: నాకు అలాంటి సినిమా తీయాలని ఉంది

ABN, First Publish Date - 2023-11-22T11:44:20+05:30

తాను అర్బన్‌ టైప్ చిత్రాలను మాత్రమే తెరకెక్కించాలని అనేక మంది ప్రేక్షకులకు ఆశగా ఉందని, తనకు మాత్రం గ్రామీణ నేపథ్యంతో సినిమాలను తెరకెక్కించాలని ఉందని ప్రముఖ సినీ దర్శకుడు గౌతం వాసుదేవ్‌ మీనన్‌ అన్నారు. ఆయన దర్శకత్వంలో చియాన్‌ విక్రమ్‌ నటించిన తాజా చిత్రం ‘ధృవనక్షత్రం’. రీతూ వర్మ హీరోయిన్‌. ఈ సినిమా ఈ నెల 24న విడుదలకాబోతోంది.

Gautham Vasudev Menon

తాను అర్బన్‌ టైప్ చిత్రాలను మాత్రమే తెరకెక్కించాలని అనేక మంది ప్రేక్షకులకు ఆశగా ఉందని, తనకు మాత్రం గ్రామీణ నేపథ్యంతో సినిమాలను తెరకెక్కించాలని ఉందని ప్రముఖ సినీ దర్శకుడు గౌతం వాసుదేవ్‌ మీనన్‌ (Gautham Vasudev Menon) అన్నారు. ఆయన దర్శకత్వంలో చియాన్‌ విక్రమ్‌ నటించిన తాజా చిత్రం ‘ధృవనక్షత్రం’ (Dhruva Natchathiram). రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్‌. ఈ సినిమా ఈ నెల 24న విడుదలకాబోతోంది. యాక్షన్‌ స్పై జోనర్‌లో రూపొందించారు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఈ మూవీ అతి ముఖ్యమైన మిషన్‌ నేపథ్యంలో సాగుతున్నట్టు తెలుసుకోవచ్చు. ఐశ్వర్యా రాజేష్‌, సిమ్రాన్‌, రాధిక కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా వివరాలను తాజాగా చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు వివరించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు.

గ్రామీణ నేపథ్యంలో కూడిన చిత్రాలను తెరకెక్కించే విషయంపై స్పందిస్తూ.. శింబు హీరోగా నిర్మించిన ‘వెందు తణిందదు కాడు’ చిత్రంలో ప్రారంభ సన్నివేశాల్లో గ్రామీణ సీన్లు ఉంటాయి. ఈ సినిమా చూసిన అనేక మంది ఎందుకు అలాంటి సినిమాలు తీస్తున్నారంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత నేను కూడా ఆలోచించాను. ఆ సన్నివేశాలు ఆ చిత్రానికి కాస్త మైనస్‌గా మారాయి. నేను అర్బన్‌ టైప్‌ చిత్రాలను తీయాలన్నది ప్రేక్షకుల కోరిక. కానీ, నాకు మాత్రం గ్రామీణ నేపథ్యంలో సినిమా తీయాలని ఉందని చెప్పారు. (Gautham Vasudev Menon Interview)


పాత చిత్రాలను రీమేక్‌ చేయాలని భావిస్తే ‘ముదల్‌ మరియాదై’ సినిమాను ఎంచుకుంటాను. ఇందులో శివాజీ గణేశన్‌ పాత్రకు కమల్‌ హాసన్‌ (Kamal Haasan), రాధిక పాత్రకు ఎవరన్నదానిపై తర్వాత వెల్లడిస్తాను అని గౌతం వాసుదేవ్‌ మీనన్‌ వెల్లడించారు. ‘ధృవనక్షత్రం’ ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుందని పేర్కొన్నారు. ఒండ్రగ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానరుపై నిర్మించిన ఈ చిత్రానికి హారీస్‌ జయరాజ్‌ సంగీతం అందించారు.

Updated Date - 2023-11-22T11:44:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!