కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yatra Raja: ధనుష్‌ పెద్ద కుమారుడికి జరిమానా.. ఎందుకంటే?

ABN, First Publish Date - 2023-11-19T14:14:20+05:30

హీరో ధనుష్‌ - ఐశ్వర్య రజనీకాంత్‌ పెద్ద కుమారుడు యాత్రకు చెన్నై నగర ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా, హెల్మెట్‌ ధరించకుండా సూపర్‌బైక్‌ను డ్రైవ్‌ చేయడంతో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనల కింద రూ.వెయ్యి జరిమానా విధించారు.

Dhanush with Sons

హీరో ధనుష్‌ (Dhanush) - ఐశ్వర్య రజనీకాంత్‌ (Aishwarya Rajinikanth) పెద్ద కుమారుడు యాత్ర రాజా (Yatra Raja)కు చెన్నై నగర ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా (Fine) విధించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా, హెల్మెట్‌ ధరించకుండా సూపర్‌బైక్‌ను డ్రైవ్‌ చేయడంతో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనల కింద రూ.వెయ్యి జరిమానా విధించారు. స్థానిక పోయెస్‌ గార్డెన్‌లోని తన తల్లి వద్ద ఉంటున్న యాత్ర... సహాయకుడితో కలిసి బైక్‌ డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నాడు.

అయితే, హెల్మెట్‌ ధరించకుండా, ఎలాంటి లైసెన్స్‌ లేకుండా బైక్‌ నడపడాన్ని ఎవరో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అది పోలీసుల దృష్టికి వెళ్లింది. నెంబర్‌ ప్లేట్‌ ఆధారంగా అది హీరో ధనుష్‌ (Dhanush) బైక్‌గా గుర్తించారు. అలాగే, హెల్మెట్‌, లైసెన్స్‌ లేకుండా యాత్ర బైక్‌ నడిపినట్టుగా నిర్ధారించి ఈ అపరాధం విధించారు. దీంతో సూపర్‌స్టార్ రజనీకాంత్ మనవడు (Rajinikanth Grand Son), ధనుష్ తనయుడు‌కి జరిమానా అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.


ధనుష్‌ విషయానికి వస్తే.. కోలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ధనుష్, ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా రేంజ్‌కి చేరుకున్నారు. తమిళ్‌లోనే కాకుండా పలు భాషల్లో ఆయన చిత్రాలు చేస్తున్నారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను వివాహం తర్వాత ధనుష్ రేంజ్ మారిపోయింది. అయితే 18 సంవత్సరాలు కలిసి ఉన్న ఈ జంట ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు పిల్లల కోసం మళ్లీ నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.. కానీ అది ఎంత వరకు నిజమనేది తెలియదు. వారికి యాత్ర రాజా (Yatra Raja), లింగా రాజా (Linga Raja) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Panja Vaishnav Tej: ‘వరుణ్‌లవ్’ వెడ్డింగ్‌ పార్టీలో రీతూ వర్మ.. రూమర్స్‌కు వైష్ణవ్ చెక్

****************************

*CWC23Final: మహేష్ బాబు ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లాలంటూ మీమ్స్.. ఎందుకంటే?

*******************************

*Raghava Lawrence: రజనీ రూపంలో రాఘవేంద్రుడిని చూశా..

*******************************

*Hi Nanna Party: పోటీలోకి ‘హాయ్ నాన్న’ పార్టీ.. మేనిఫెస్టో విడుదల

*******************************

Updated Date - 2023-11-19T14:14:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!