Farhana: ఇస్లాంకు వ్యతిరేకం కాదు.. కేరళ స్టోరీ కాంట్రవర్సీతో చిత్రయూనిట్ ముందు జాగ్రత్త చర్యలు
ABN, First Publish Date - 2023-05-07T14:59:15+05:30
ప్రస్తుతం ముస్లిం నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) చిత్రం ఎటువంటి కాంట్రవర్సీకి గురైందో తెలియంది కాదు. అందుకే.. ‘ఫర్హానా’ యూనిట్ ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) ప్రధాన పాత్రలో..
తమ సొంత నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ (Dream Warrior Pictures) బ్యానరుపై నిర్మించిన ‘ఫర్హానా’ (Farhana) చిత్రం ఇస్లాం ప్రజలకు, ఆ మతానికి వ్యతిరేకం కాదని ఇందులో ఒక్క వివాదాస్పద అంశం కూడా లేదని, ఈ చితాన్ని చూసే ప్రతి ఒక్క ముస్లిం విజయగర్వంతో పండుగ చేసుకునేలా ఉంటుందని నిర్మాత ఎస్.ఆర్. ప్రభు (SR Prabu) చెప్పారు. ప్రస్తుతం ముస్లిం నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) చిత్రం ఎటువంటి కాంట్రవర్సీకి గురైందో తెలియంది కాదు. అందుకే.. ‘ఫర్హానా’ యూనిట్ ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) ప్రధాన పాత్రలో నెల్సన్ వెంకటేశన్ (Nelson Venkatesan) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫర్హానా’ చిత్రం.. ఈ నెల 12న విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రయూనిట్ తాజాగా చెన్నైలో ఆడియో వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్.ఆర్.ప్రభు మాట్లాడుతూ.. ‘‘ఈ మూవీలో ఒక్క వివాదాస్పద (Controversy) సన్నివేశం, డైలాగ్ లేదు. ప్రతి ఒక్క మహిళా ఎదుర్కొనే ఒక ప్రధాన సమస్యను ఇందులో చూపించాం’’ అని అన్నారు. నటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు నేను నటించిన చిత్రాల జాబితాలో ‘ఫర్హానా’కు ప్రత్యేక స్థానం ఉంటుంది. గత యేడాది నేను నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఈ యేడాది ప్రతి నెలా ఒక్కో చిత్రం విడుదల కావడం సంతోషంగా ఉంది. ఇందులో ఒక మంచి పాత్రను పోషించానని తెలిపింది.
ఇక దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ (Director Nelson Venkatesan) మాట్లాడుతూ.. నేను పుట్టిపెరిగి, చదువుకున్న ప్రాంతాలకు చెందిన కథ. నా మట్టి కథ. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉందని దుష్ప్రచారం చేస్తూ వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వివాదాలకు ఇందులో తావులేదు. ప్రతి ఒక్క ముస్లిం గర్వపడేలా ఈ చిత్రం ఉంటుంది. సినిమా షూటింగ్ కూడా ట్రిప్లికేణి ఐస్‌హౌస్ పరిధిలోని చాలా సున్నితమైన, ముస్లింలు ఉన్న వీధుల్లోనే లైవ్ లొకేషన్‌లలో చిత్రీకరించాం. షూటింగ్ సజావుగా సాగేందుకు సహకరించిన ప్రతి ఒక్క నటీనటుడికి ధన్యవాదాలు. నేను దర్శకత్వం వహించిన రెండు చిత్రాలకు భిన్నంగా ఉంటుందని చెప్పారు. గోకుల్ బినోయ్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*The Kerala Story: కేరళ స్టోరీకి తమిళ నాడులో షాక్.. విషయం ఏమిటంటే?
*NTR: మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడా?
*Pic Talk: చందురుని మించు అందమొలికించు...
*Dimple Hayathi: కొంటె పనులు చాలా చేశాను
*Megastar VS Superstar: చిరంజీవికి పోటీగా రజనీకాంత్.. ఆగస్ట్‌లో అసలు మజా!