Kadhale Kadhale: మహత్ - మీనాక్షిల ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మొదలైంది
ABN, First Publish Date - 2023-10-25T11:50:04+05:30
మహత్ రాఘవేంద్ర - మీనాక్షి గోవిందరాజ్ హీరోహీరోయిన్లుగా ‘కాదలే కాదలే’ పేరుతో కొత్త చిత్రం తెరకెక్కనుంది. శ్రీవారి ఫిలిమ్స్ బ్యానరుపై నిర్మాత పి.రంగనాథన్ నిర్మిస్తుండగా ఆర్. ప్రేమ్‌నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా శ్రీవారి ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
మహత్ రాఘవేంద్ర (Mahat Raghavendra) - మీనాక్షి గోవిందరాజ్ (Meenakshi Govindarajan) హీరోహీరోయిన్లుగా ‘కాదలే కాదలే’ (Kadhale Kadhale) పేరుతో కొత్త చిత్రం తెరకెక్కనుంది. శ్రీవారి ఫిలిమ్స్ బ్యానరుపై నిర్మాత పి.రంగనాథన్ (P Ranganathan) నిర్మిస్తుండగా ఆర్. ప్రేమ్‌నాథ్ (R Premnath) దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆనందించే చిత్రాలను నిర్మించే సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన శ్రీవారి ఫిలిమ్స్.. ఇపుడు మరో కంటెంట్‌తో ఓ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని నిర్మించనుంది.
బుధవారం నుంచి సెట్స్‌పైకి వెళ్లే ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అనివార్యమైన శక్తి. యుక్తవయసు నుంచి వృద్ధాప్యం వరకు జీవితంలో ఇది ఒక భాగం. ఏది ఏమైనప్పటికీ ప్రేమలో ఉండటం, ఒకే భాగస్వామితో బలమైన వైవాహిక సంబంధంతో కొనసాగడం అనేది కాలక్రమేణా మారిపోయింది. సమకాలీన సంబంధాలలో పెను మార్పు వచ్చింది. అందుకే ఈ చిత్రాన్ని నేటితరం యువతీ యువకుల ప్రేమ, సంబంధ బాంధవ్యాలపై వారి దృక్పథాన్ని తెలిపేలా ఉంటుంది. (Kadhale Kadhale Movie Update)
అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకర్షించేలా తీర్చిదిద్దుతున్నాం. ఆ పాత్రకు మహత్ రాఘవేంద్ర అయితే, సరిగ్గా సరిపోతారని ఆయనను ఎంపిక చేశాం. హీరోయిన్ మీనాక్షి విషయంలోనూ ఇదే అభిప్రాయంతో ఎంపిక చేశాం. ఇందులో సీనియర్ దర్శకులు భారతీరాజా, కేఎస్ రవికుమార్, వీటీవీ గణేష్, రవీనా రవి తదితరులు నటిస్తున్నారు. ‘సీతారామం’ (Sita Ramam) వంటి మ్యూజికల్ హిట్ తర్వాత విశాల్ చంద్రశేఖర్ మరోమారు రొమాంటిక్ బాణీలను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు’’ అని వివరించారు. (Director R Premnath about Kadhale Kadhale)
ఇవి కూడా చదవండి:
============================
*Bubblegum: రోషన్ కనకాల మూవీ నుండి మరో రొమాంటిక్ పిక్..
********************************
*Vinayakan: ‘జైలర్’ విలన్ వినాయకన్ అరెస్ట్.. ఎందుకంటే?
**********************************
*Saripodhaa Sanivaaram: శనివారం వరకు ఎందుకుని.. మంగళవారమే క్లాప్ కొట్టేశారు
************************************