కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Aprudhan: రాఘవ లారెన్స్‌ను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు మృతి

ABN, First Publish Date - 2023-11-08T13:38:52+05:30

నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్‌ను ‘అర్బుదమ్‌’ అనే చిత్రం ద్వారా వెండితెరకు హీరోగా పరిచయం చేసిన దర్శకుడు అర్బుదన్‌ మృతి చెందారు. 2002లో ఈ చిత్రం వచ్చింది. ఆ తర్వాత ఆయన శ్యామ్‌ హీరోగా వచ్చిన ‘మనదోడు మళైక్కాలం’ వంటి అనేక చిత్రాలను తెరకెక్కించారు. తెలుగులో ఉదయ్ కిరణ్‌తో ‘లవ్ టుడే’ అనే చిత్రాన్నిఅర్బుదన్ డైరెక్ట్ చేశారు.

Uday Kiran Love Today Movie Director Aprudhan

నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence)ను ‘అర్బుదమ్‌’ అనే చిత్రం ద్వారా వెండితెరకు హీరోగా పరిచయం చేసిన దర్శకుడు అర్బుదన్‌ (Aprudhan) మృతి చెందారు. 2002లో ఈ చిత్రం వచ్చింది. ఆ తర్వాత ఆయన శ్యామ్‌ హీరోగా వచ్చిన ‘మనదోడు మళైక్కాలం’ (Manadhodu Mazhaikalam) వంటి అనేక చిత్రాలను తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో 52 సంవత్సరాల అర్బుదన్‌ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు.


అయితే, ఆ ఆస్పత్రిలోనే ఆయన సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మృతి చెందగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు. అర్బుదన్‌ తెలుగులోనూ ఓ సినిమా చేశారు. దివంగత నటుడు ఉదయ్ కిరణ్ (Uday Kiran) హీరోగా 2004లో వచ్చిన ‘లవ్ టుడే’ (Love Today) చిత్రానికి అర్బుదన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో హీరోయిన్ దివ్య కోస్లా కుమార్ (Divya Khosla Kumar) హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైంది. తనికెళ్ల భరణి, సునీల్, సుమన్ శెట్టి వంటి వారు ఈ చిత్రంలో నటించారు.


ఇవి కూడా చదవండి:

========================

*Kannappa: ‘కన్నప్ప’కు అదే కరెక్ట్ అంటోన్న మంచు విష్ణు

*************************************

*NBK109: బాలయ్య మరో మాస్ రాంపేజ్ అప్‌డేట్.. పిక్ అదిరింది

*************************************

*Dum Masala: ‘గుంటూరు కారం’ దమ్ మసాలా సాంగ్ టాకేంటి?

*************************************

Updated Date - 2023-11-08T14:11:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!