Mark Antony: విశాల్ సినిమాకి న్యాయపరమైన చిక్కులు క్లియర్, విడుదలకి సిద్ధం
ABN, First Publish Date - 2023-09-12T16:24:41+05:30
నిన్నటి వరకు విశాల్ నటించిన 'మార్క్ ఆంటోనీ' సినిమాకి న్యాయపరమైన చిక్కులు ఉండటంతో ఆ సినిమా అనుకున్న తేదీకి విడుదల అవుతోందో లేదో అని చిన్న అనుమానం ఉండేది, కానీ ఈరోజు విశాల్ అవన్నీ క్లియర్ అయిపోయాయి అని ట్వీట్ చేసాడు.
తమిళ నటుడు విశాల్ (Vishal) ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా 'మార్క్ ఆంటోనీ' #MarkAntony. ఈ సినిమాకి దర్శకుడు అధిక రవిచంద్రన్ (AdhikRavichandran), ఇందులో ఎస్ జె సూర్య (SJSuryah) ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అయితే గత కొన్ని రోజుల నుండి ఈ సినిమా మీద న్యాయపరమైన చిక్కులు ఉండటంతో ఈ సినిమా అనుకున్న తేదీ అయిన సెప్టెంబర్ 15కి విడుదల అవుతుందో లేదో అని అందరూ అనుకున్నారు. అందుకే విడుదల కాకపోవచ్చు అని కూడా కొంతమంది అనుకున్నారు.
చెన్నై కోర్టులో లైకా ప్రొడక్షన్ (LycaProductions) సంస్థ ఈ విశాల్ సినిమాని ఆపుచేయాలంటూ అప్పీల్ చేసింది. కోర్టు కూడా విశాల్ వ్యక్తిగతంగా హాజరు కావాలని, అలాగే కోర్టు రిజిస్ట్రార్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి అందులో రూ. 21 కోట్లు జమ చెయ్యాలని అది కోర్టుకి చూపించాలని, అప్పుడే ఈ సినిమా విడుదలకి అవకాశం ఉంటుంది అని కూడా చెప్పింది.
అయితే వీటన్నిటికీ తెర దించుతూ విశాల్ ఈరోజు ఒక ట్వీట్ చేసాడు. అందులో ఈ సినిమా న్యాయపరమైన చిక్కులు అన్ని తొలగిపోయాయని, సినిమా ఈనెల 15న విడుదలకి సర్వం సిద్ధం అయిందని చెప్పాడు. అలాగే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం భాషల్లో 15న విడుదలవుతోంది, హిందీలో మాత్రం ఈనెల 22న వివుడల అవుతుందని చెప్పాడు. కోర్ట్ స్టే సినిమా మీద వెకేట్ అయిపోయిందని, సినిమాకి ఎటువంటి అడ్డంకులు లేవని చెప్పాడు. దీనితో ఈ సినిమా సెప్టెంబర్ 15న సోలోగా విడుదల అవుతోంది.
ఆరోజు విడుదల కావాల్సిన రామ్ పోతినేని (RamPothineni), బోయపాటి శ్రీను (BoyapatiSreenu) సినిమా 'స్కంద' #Skanda 28కి వాయిదా పడింది. అలాగే 'చంద్రముఖి 2' #Chandramukhi2 కూడా 28కి వెళ్ళింది. అందుకని విశాల్ కి వినాయకచవితి (VinayakaChavithi) సెలవు దినం కూడా కలిసి వస్తుంది అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. ఒకవేళ సినిమా పాజిటివ్ టాక్ వస్తే విశాల్ కి ఈ తేదీ ఒక గొప్ప ఛాన్స్ అని కూడా అంటున్నారు.