Vishal: విశాల్ ఎఫెక్ట్.. ఆ చిత్రాల సెన్సార్ నిబంధనలలో మార్పు!
ABN, First Publish Date - 2023-10-20T21:39:13+05:30
తమిళం నుంచి హిందీలోకి అనువాదమయ్యే డబ్బింగ్ చిత్రాల సెన్సార్ కార్యక్రమాలను ఇకపై చెన్నైలోనే పూర్తి చేయనున్నారు. ఈ విధానం ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే ఆరు నెలల పాటు కొనసాగుతుంది. ఇప్పటివరకు హిందీలోకి అనువాదం చేసే తమిళ చిత్రాలకు సెన్సార్ కార్యక్రమాలు ముంబై కార్యాలయంలో చేస్తున్న విషయం తెల్సిందే.
తమిళం నుంచి హిందీలోకి (Tamil to Hindi) అనువాదమయ్యే డబ్బింగ్ చిత్రాల సెన్సార్ (Censor) కార్యక్రమాలను ఇకపై చెన్నైలోనే పూర్తి చేయనున్నారు. ఈ విధానం ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే ఆరు నెలల పాటు కొనసాగుతుంది. ఇటీవల హీరో విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు సెన్సార్ సర్టిఫికెట్ మంజూరు చేసేందుకు రూ.6.50 లక్షల లంచం ఇచ్చినట్టు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై సీరియస్ అయిన కేంద్రం... ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి తాజాగా కొత్త ఉత్తర్వులు జారీచేశారు. ఇకపై దక్షిణాది చిత్రాలకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతాయో.. అదే కార్యాలయంలో తమిళం నుంచి హిందీలోకి అనువాదమయ్యే చిత్రాలకు కూడా సెన్సార్ సర్టిఫికెట్‌ను పొందొచ్చని తెలిపింది. ప్రయోగాత్మకంగా ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే ఆరు నెలల పాటు ఈ విధానం అమలు చేయనున్నారు. కాగా, ఇప్పటివరకు హిందీలోకి అనువాదం చేసే తమిళ చిత్రాలకు (Kollywood Movies) సెన్సార్ కార్యక్రమాలు ముంబై కార్యాలయంలో చేస్తున్న విషయం తెల్సిందే. రాబోయే ఆరు నెలల పాటు ఈ విధానంలో మార్పు రానుంది. ఇది వర్కవుట్ అయితే.. ఇకపై ఇదే విధానాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
============================
*Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’.. ఇది ఆరంభం మాత్రమే! ముందుండాది..
******************************************
*Dude: ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్’.. షూట్ మొదలయ్యేది ఎప్పుడంటే?
***************************************
*Baby Combo Repeats: మళ్లీ కల్ట్ బ్లాక్‌బస్టర్ కాంబో.. కాకపోతే?
*******************************************
*Vijayashanti: మరో సినిమాకు సైన్ చేసిన రాములమ్మ.. ఈసారి ఏ హీరో సినిమా అంటే?
************************************
*Bhagavanth Kesari: ఫస్ట్ డే కలెక్షన్ల ఊచకోత.. ఇది బాలయ్య సౌండ్.. ఎట్లుంది?
**********************************