Amala Paul: మళ్లీ స్పాట్లైట్లోకి అమల.. ఫొటోస్‌తో మతి పోగొట్టేసిందిగా!
ABN, First Publish Date - 2023-07-22T15:01:19+05:30
గత కొంతకాలంగా కెమెరా కంటికి చిక్కకుండా తెరచాటుకు వెళ్ళిపోయిన హీరోయిన్ అమలా పాల్.. మళ్ళీ కెమెరా ముందుకు వచ్చింది. ఇదే విషయంపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘మళ్లీ స్పాట్లైట్లోకి వచ్చాను’ అంటూ కామెంట్ చేస్తూ పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గత కొంతకాలంగా కెమెరా కంటికి చిక్కకుండా తెరచాటుకు వెళ్ళిపోయిన హీరోయిన్ అమలా పాల్ (Amala Paul).. మళ్ళీ కెమెరా ముందుకు వచ్చింది. ఇదే విషయంపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘మళ్లీ స్పాట్లైట్లోకి వచ్చాను’ అంటూ కామెంట్స్ చేసింది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అమలా పాల్‌కు ఆ తర్వాత అన్ని భాషల్లోనూ సినీ అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత ఆమె తన సొంత నిర్మాణ సంస్థపై ‘కెడావర్’ అనే చిత్రాన్ని నిర్మించగా, ఇది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. గత యేడాది రాజస్థాన్‌కు చెందిన తన ప్రేమికుడితో కలిసి పుదుచ్చేరిలోని ఆరోవిల్‌లో సంసార జీవితాన్ని ప్రారంభించిన అమలా పాల్ అతడితో మనస్పర్థల కారణంగా దూరమైంది. (Amala Paul Photos Goes Viral)
అదే సమయంలో స్థల మోసం కేసులో కోర్టు వరకు వెళ్లి అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాకు దూరమైంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేస్తూ ‘మళ్ళీ స్పాట్లైట్ (Spotlight)లోకి వచ్చేశాను’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు కొన్ని గంటల్లోనే లక్షలాది మంది లైక్ చేశారు. ప్రస్తుతం ఆమె పృథ్విరాజ్ సుకుమారన్‌తో కలిసి ‘ఆడు జీవితం’ (Aadujeevitham) అనే చిత్రంలో నటిస్తోంది. టాలీవుడ్‌లోనూ ఈ భామ మంచి సినిమాలలోనే నటించింది.
కోలీవుడ్‌లో అరంగేట్రం చేసిన సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్.. ఆ తర్వాత నటిగా తన పరిధిని విస్తరించుకునే క్రమంలో ఫెయిలైంది. తమిళ డైరెక్టర్ ఏ.ఎల్. విజయ్ (AL Vijay)ని వివాహం చేసుకుని.. ఆ తర్వాత కొన్నాళ్లకే అతనితో విడిపోయింది. అప్పటి నుంచి ఏదో రకంగా అమలా పాల్ వార్తలలో నిలుస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఫొటోలు హాట్ టాపిక్‌గా మారుతుంటాయి.
ఇవి కూడా చదవండి:
**************************************
*SS Rajamouli: ‘కల్కి 2989 AD’ గ్లింప్స్ రాజమౌళికి నచ్చిందా.. ఎలా స్పందించారంటే?
**************************************
*Unstoppable: ఓటీటీలోకి వచ్చేసిన ‘అన్‌స్టాపబుల్’.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..
**************************************
*Malavika Mohanan: జీవితం ఒక కళాకృతి కాదా?
**************************************
*Chiru-Allu Arjun: మామ, అల్లుడు.. ఎవ్వరూ తగ్గట్లే..!
**************************************
*VarunLavanya: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఎప్పుడంటే..?
**************************************