Thunivu: ‘రవీంద్రా.. ఇది తమిళనాడు.. నీ చేష్టలు చూపించకు’.. డైలాగ్ వైరల్
ABN, First Publish Date - 2023-01-14T09:06:22+05:30
అజిత్ కుమార్ (Ajith Kumar) - హెచ్. వినోద్ (H Vinod) కాంబినేషన్‌లో వచ్చిన ‘తుణివు’ (Thunivu) చిత్రంలో.. పోలీస్ కమిషనర్ పాత్రలో ప్రముఖ నటుడు సముద్రఖని (Samuthirakani) నటించారు. ఇందులో ఒక ఎన్‌ఎస్‌జీ
అజిత్ కుమార్ (Ajith Kumar) - హెచ్. వినోద్ (H Vinod) కాంబినేషన్‌లో వచ్చిన ‘తుణివు’ (Thunivu) చిత్రంలో.. పోలీస్ కమిషనర్ పాత్రలో ప్రముఖ నటుడు సముద్రఖని (Samuthirakani) నటించారు. ఇందులో ఒక ఎన్‌ఎస్‌జీ ఆఫీసరుతో ఆయన చెప్పే సంభాషణ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రవీంద్రా ఇది తమిళనాడు.. నీ చేష్టలు చూపించకు’ అని చెప్పే డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం లేకపోలేదు.
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ నెల 9న తమిళ నాడు రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో గవర్నర్ రవి (Governor of Tamil Nadu) ప్రభుత్వ ప్రసంగాన్ని మార్చి చదివారు. దీంతో నిండు సభలో గవర్నర్‌కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి స్టాలిన్ (CM Stalin) ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న గవర్నర్ ఆగ్రహంతో సభ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించారు. గవర్నర్ రవి (Tamil Nadu Governor Ravi) వ్యవహారశైలి ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. పైగా ‘గెటవుట్ రవి’ (GetOutRavi) అనే పోస్టర్లు కూడా వెలిశాయి. ఇలా ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో అజిత్ వంటి స్టార్ హీరో చిత్రంలో ‘రవీంద్ర ఇది తమిళనాడు.. ఈ చేష్టలు చూపించకు’ అనే డైలాగ్‌ను గవర్నర్ రవికి ఆపాదించి నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం తమిళ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తుండటం విశేషం.