సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ajith Kumar 62: నయన్‌ కాదు.. త్రిష కాదు.. మరెవరు?

ABN, First Publish Date - 2023-01-07T11:55:53+05:30

సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. రాత్రికి రాత్రే పాత్రలు, పాత్రధారులు మారిపోతుంటారు. తాజాగా అజిత్‌ కొత్త చిత్రం విషయంలో అదే జరుగుతున్నట్లు తమిళ మీడియా చెబుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. రాత్రికి రాత్రే పాత్రలు, పాత్రధారులు మారిపోతుంటారు. తాజాగా అజిత్‌ కొత్త చిత్రం విషయంలో అదే జరుగుతున్నట్లు తమిళ మీడియా చెబుతోంది. అజిత్‌ 62(Ajith kumar 62)వ సినిమా త్వరలో సెట్స్‌ మీదకెళ్లనుంది. లైకా ప్రొడక్షన్స్‌(lyca productions) సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నయనతార భర్త విఘ్నేశ్‌ శివన్‌ (vignesh sivan) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు మొదలయ్యాయి. త్వరలోనే సెట్స్‌ మీదకెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనే దానిపై చర్చ మొదలైంది. మొదట నయనతార కథానాయిక అనుకున్నారు. అయితే ఇతర ప్రాజెక్ట్‌ల వల్ల ఈ సినిమాకు అంగీకరించలేదు. అజిత్‌, నయన్‌ (nayantara)కాంబినేషన్‌లో ‘ఆరంభం’, ‘విశ్వాసం’ వంటి విజయవంతమైన చిత్రాలొచ్చాయి. నయన్‌ రిజెక్ట్‌ చేయడంతో త్రిషను (Trisha)కధానాయికగా అనుకున్నారు. ఇప్పుడు ఆమె కూడా ఈ చిత్రంలో నటించడం లేదని సమాచారం. ఇప్పుడు ఆ ఆ స్థానాన్ని కాజల్‌ (Kajal new choice)అగర్వాల్‌ భర్తీ చేసిందని సమాచారం. అయితే అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. గతంలో అజిత్‌-కాజల్‌ కాంబినేషన్‌లో ‘వివేకం’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం కాజల్‌ ‘ఇండియన్‌-2’ చిత్రంలో నటిస్తోంది.

Updated Date - 2023-01-07T11:55:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!